Others

స్వేచ్ఛకు వాటా - పిల్లల ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిని నూరేళ్లపాటు సుఖ సంతోషాలతో నిలబెట్టేది కుటుంబ జీవనమే. కుటుంబ జీవనంలో పిల్లల భాగస్వామ్యం ప్రధానమైంది. పిల్లలకి తల్లిదండ్రులే మొదటి బాస్‌లు. వారికి మోరల్ క్లాసులు ఎక్కడో బళ్లలో కాదు...ఇంట్లోనే ప్రారంభం కావాలి. భార్యాభర్తలు కలిసి అక్కర్లేని ముళ్లు వేసి వారి జీవితం చిక్కులమయం చేయకూడదు. వారు సరైన దారిలో వున్నతంగా వుండేలా తల్లిదండ్రులే డిజైన్ చేయాలి. మారుతున్న కాలం, పెడపోకడలు, పిల్లల స్నేహాలు, ఎక్స్‌ప్రెషన్స్ నిరంతరం గమనిస్తూ వుంటాలి.
పూర్తి స్వేచ్ఛ పిల్లల్ని చెడదారులు పట్టిస్తుంది. నియమ నిబంధనలు తప్పనిసరి అయినా అవి వారికి సంకెళ్లు వేసేవిగా వుండకూడదు. ఏవి తింటే మంచిది, తినకూడని వాటివల్ల కలిగే నష్టాలు తెలియజెప్పాలి. ఈ రోజుల్లో ఇంట్లో కంప్యూటర్ తప్పనిసరి అయింది. కంప్యూటర్ గేమ్స్ పిల్లకు విజ్ఞానాన్ని వినోదాన్ని కలిగించేవిగా వుండేలా తగిన సూచనలు అందించాలి. రేపటి రోజున వారు ఎలా ఎదగాలనుకుంటున్నారో వారిని ఆ దిశగా నడిపించాలి.
పిల్లల పట్ల బాధ్యత అన్నది సరిహద్దులు లేని ప్రయాణం. ఇది నిరంతరం సాగుతునే వుండాలి. ఒక్కో సందర్భంలో ఆర్థికం, అనారోగ్యం తదితర సమస్యలు మిమ్మల్ని కంట్రోల్‌లో వుంచకపోవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. గట్టిగా అరవవచ్చు. వారి మనసు చిన్నబుచ్చుకున్నదా...డిప్రెషన్‌లోకి వెళ్లారా ఆనక గమనించి గ్రహించి తగిన మాటల వైద్యం మీరే అందించాలి.
పిల్లలతో షాపింగులు, కొనుగోళ్లకు వెళ్లినపుడు వాటి ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్తలు చెప్పాలి. కొందరికి ఎడాపెడా ఖర్చు చేసే అలవాటు వుంటుంది. పిల్లలకు అది ఒక అలవాటుగా మారిందంటే పెద్దయ్యాక అదే ఓ సమస్యగా మారి వారిని పట్టిపీడిస్తుంది. తమకొచ్చే ఆదాయాన్ని, ఖర్చుల్ని అర్ధమయ్యే రీతిలో చెప్పాలి. ఎదుటివారికంటే తక్కువ ఆదాయం వుందని పిల్లల దగ్గర చిన్నతనం ప్రదర్శించకూడదు. అలాగే పిల్లలకు తమకున్న దాంట్లో సుఖ సంతోషాలతో మనగలిగేలా సూచనలు, అలవాట్లు అందించాలి. పిల్లలు సరైన ధోరణితో వుంటే వారి స్వేచ్ఛకి వదిలేయండి. అలాకాక ఎదుటి వారికున్న దానితో తమని పోల్చుకుని ఆత్మన్యూనతకి లోనవుతుంటే వెంటనే వారికి మానసిక పరివర్తన కలిగించే చర్యలు చేపట్టండి.
ఎదుటివారికంటే తాము ఎందుకు తక్కువలో వుండాల్సి వచ్చింది, రేపటి రోజున పిల్లలు ఎలాంటి మార్గంలో ఉన్నత శిఖరాలు అందుకోగలరు వివరించి చెప్పండి. భవిష్యత్తుపట్ల ఆశ కలిగేలా వారిని జాగృతం చేయండి. పిల్లల్లోని మానసిక భావాలు స్వేచ్ఛగా ఓడైరీ రూపంలో రాసుకునేలా ప్రోత్సహించిండి. ఇది చిన్న విషయం అనిపించినా భవిష్యత్తులో వారు కోరుకునే ప్రపంచానికి వారిని చేరువ చేస్తుంది. ఫలానా చోటుకి వెళ్లొద్దు, ఫలానా వారితో స్నేహం చేయద్దు అనే సంకెళ్లు విధించేకన్నా ఎందుకు అలా చేయకూడదో వివరించండి.
ఆటలైతేనేం, పాటలైతేనేం చదువైతేనేం నిరంతరం బిజీగా వుండేలా వారికో స్పేస్‌ని, ఛానల్‌ని మీరే రూపొందించండి. సమాజపు పోకడలు, బాధ్యతలు, భయాలు, ప్రమాదాలు వివరించి చెప్పండి.

-వి.నాగలక్ష్మి