Others

నాకు నచ్చిన సినిమా స్వాతిముత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.విశ్వనాథ్ సినిమాలలోకెల్లా అద్భుతమైన కళాఖండం స్వాతిముత్యం. ప్రారంభం నుంచి ముగింపు దాకా ఆర్ద్రతతో బిగి సడలకుండా ప్రేక్షకులకి వినోదాన్ని పంచే చిత్రమిది. ఈ సన్నివేశం, ఆ సన్నివేశం అని కాకుండా అన్ని సీన్లూ సినిమాలో అద్భుతంగా పండాయి. ఆమూలాగ్రం అనిర్వచనీయమైన భావనతో సాగుతుంది. కె.విశ్వనాథ్, కమల్‌హాసన్, కళాపిపాసను తమ తపశ్శక్తితో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఓ విధవకు అండగా ఆమె బిడ్డకు తండ్రిగా కమల్‌హాసన్ మనస్సు పొరల్లోకి చొచ్చుకుపోయేలా నటించారు. నిప్పులగుండం తొక్కడం, మేనమామను కోపంతో కొట్టడంలాంటి సన్నివేశాల్లో జీవించాడు. నాయనమ్మ మాటలకు కుమిలి పెద్దగా ఏడవటం లాంటి సన్నివేశాల్లో మరెవరినీ ఊహించుకోలేం.
ఒక్కసారి చూశాను. కానీ మర్చిపోలేకపోయాను. నాలోవున్న అభిప్రాయం, అభిమానం, మమకారం, అనుభూతి ఇవన్నీ అలాగే మిగిలిపోయాయి. పచ్చి తాటాకులాగా, అప్పుడే ఎండలో పెట్టిన వడియంలా ఎప్పటికీ ఈ సినిమా నా గుండెల్లో గుర్తుంటుంది. తెల్లవారుఝామున కట్టిన మంగళ తోరణంలా స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తునే ఉంటుంది.

-బి మోహనకుమారి, చెన్నయ్