Others

శబ్ద కాలుష్యంతో నరకయాతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక యుగంలో జల,వాయు కాలుష్యాలతోపాటు శబ్దకాలుష్యం అనూహ్యంగా పెరిగిపోతోంది. చట్టాలెన్ని ఉన్నప్పటికీ దీనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. బస్సుల్లో రాత్రివేళ ప్రయాణీకుల కాలక్షేపానికి టీవీలు పెరిగిపోయాయి. ప్రయాణంలో కూడా టీవీ చూడాలా? బస్సు హారన్లు ఎలాగూ తప్పవు. వీటికి తోడు టీవీ ధ్వని. ఇక పగటిపూట బస్సులలో పెద్ద శబ్దంతో పాటలు పెడుతున్నారు. ప్రయాణీకులను ఎక్కించుకోగానే ఆటోడ్రైవర్లు చెవులు బద్దలయేలా రణగొణ ధ్వనితో పాటలు పెడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాలలో ఇది అంతగా ఉన్నట్టు లేదు. వీటిని ప్రభుత్వం తలచుకుంటే నిషేధించగలదు. ఎందుకు నిధించడం లేదు?
బస్సులలో టీవీలు రాత్రి పనె్నండు గంటల వరకు ఏకధాటిగా పెడుతున్నారు. చాలామంది ప్రయాణీకులు ఈ బాధలు వౌనంగా భరిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని వీటిని నిషేధించాలి. ఇక దేవాలయాలలో మైకుల బాధ వర్ణనాతీతం. మనకి అన్నీ పర్వదినాలే. అడుగడుగుకీ ఒక గుడి ఉంది. ప్రతి గుడిలోను మైకు ఉంటుంది. ఉదయం, సాయంత్రం మైకులను తప్పకుండా వినియోగిస్తారు. చుట్టుపక్కల ఒకరి మాట ఒకరికి వినబడనంత శబ్దంతో పాటలు పెడతారు. ఇవి విని ఎవరు ఆనందిస్తారు? భగవదారాధనకి నిశ్శబ్దం ప్రధానమైనది. ఆలయాలలో వౌనం పాటించాలి. ప్రార్థనలు వౌనంగానే జరగాలి. భజనలు చేయకూడదా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. భజనలకు మృదంగ తాళ వాద్యాలు చాలు. ఇక కల్యాణ మంటపాలలో మైకులు చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కల్గిస్తాయని ఎవరూ ఆలోచించరు. వౌనంగా ఆ శబ్దాలు భరించవలసినదే. నేడు శుభాశుభ కార్యాలకు మైకులు తప్పనిసరి అయిపోయాయి. అన్న సమారాధనలు జరిగేచోట ఎవరు ఎంత చందా ఇచ్చినది మైకులో ప్రకటిస్తారు. వివాహ వేడుకలలో పెద్ద శబ్దాలతో బాంబులు పేలుస్తున్నారు. పెద్ద శబ్దాలతో బాణసంచా కాలుస్తున్నారు. విపరీతమైన శబ్దాలతో మైకులు ఉపయోగించడం, బాణసంచా కాల్చడం నిబంధనలకు వ్యతిరేకం. వీటిని అమలుచేసేది ఎవరు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు అనగానే అందరికీ పోలీస్ స్టేషన్ గుర్తుకి వస్తుంది. లిఖితపూర్వకంగా ఎవరు ఫిర్యాదు చేస్తారు? ఎవరూ చేయరు. పోలీసులు కూడా తమకు ఫిర్యాదు అందలేదంటారు.
వివాహ వేడుకలలో శబ్దం లేని తారాజువ్వలు వేసుకోవచ్చు. చిచ్చుబుడ్లు వెలిగించవచ్చు. దేవాలయాలలో మైకులు వీలైనంత తక్కువ శబ్దంతో ఉపయోగించాలి. ఇది కూడా పర్వదినాలకి పరిమితం చేయాలి. అందువలన చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలుగదు. గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రుల సందర్భంలోను మైకులు తగ్గించి దీపాలంకరణకి ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ వాహనాల వలన ఉత్పత్తిఅయ్యే కాలుష్యం అనేక అనర్థాలకు దారితీస్తుంది. దీనిని నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. శబ్దకాలుష్య నివారణకు అందరూ పూనుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిబంధనలను అమలుచేయడానికి కృషిచేయాలి. చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. వాటిని కఠినంగా అమలుచేయాలి.

- వేదుల సత్యనారాయణ