అమృత వర్షిణి

భూతల స్వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేఘాలయ భూతల స్వర్గం. మబ్బు తునకలు చాలా క్రిందికి తలల మీంచి పిల్ల తెమ్మెరలకు మల్లే పయనించడం తీయటి అనుభూతి. కొన్ని మబ్బులు తమతోపాటు మనల్ని కూడా తీసుకుపోతున్నట్లుగా ఉంటుంది. అంత క్రిందుగా మేఘ మాలికలు సాగిపోతాయక్కడ. చక్కటి వాతావరణం, పచ్చని ప్రకృతి, ఎతె్తైన పర్వతాలు, ఉవ్వెత్తున ఎగసి దుమికే జలపాతాలు.. చూడచక్కని అందాలెన్నో. చక్కని ఆతిథ్యం ఇచ్చే ‘ఖాసీ’ ‘జైన్‌టియాస్’ ‘గారోస్’ తెగలకి చెందిన ఆదివాసీలు.. మేఘాలయ అంటేనే మబ్బులమయమైన స్వర్గ్ధామం.
ఇక్కడ ముఖ్యంగా చూడవల్సినవి ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్, కేథలిక్ చర్చ్, లేడీ హైదరీ పార్క్, వార్డ్స్ లేక్, సంగ్మా స్టేట్ మ్యూజియం.
మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్. ఇది తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య కేంద్రం. అందమైన హిల్‌స్టేషన్. ఇది గౌహతికి 103 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1491 అడుగుల ఎత్తున.. మొత్తం ఈశాన్య ప్రాంతానికి ప్రధాన విద్యాకేంద్రంగా ఉంది.
ఎలిఫెంట్ ఫాల్స్: షిల్లాంగ్ పట్టణం శివారు ప్రాంతం నుంచీ 12 కి.మీ. దూరంలో ఈ జలపాతాలు ఉన్నాయి. అతి పెద్ద పర్వతాల నుంచి కిందికి దుముకుతూ కనులకింపుని కలిగిస్తాయి. ఇవి - వీ-లాప్లమ్ ఫాల్స్, విర్-వింగ్ ఫాల్స్. పాలలాగ తెల్లటి నురగతో స్వచ్ఛంగా ఉంటాయి.
షిల్లాంగ్ పీక్: ఇది అతి ఎతె్తైన పిక్నిక్ స్పాట్. సముద్ర మట్టానికి 1965 మీటర్ల ఎత్తున ఉంది. షిల్లాంగ్ నుంచి 10 కి.మీ. దూరంలో ఉంది. సాయంకాల సమయంలో షిల్లాంగ్‌లోని పనరోమాని ఇక్కడి నుండి చూడగలం. షిల్లాంగ్ సిటీ లైట్స్ స్టార్స్‌లా మెరుస్తూ నయనానందకరంగా ఉంటాయి. బాలీవుడ్ సినిమాలు అనేకం ఇక్కడ షూటింగ్ చేయబడ్డాయి. ఈ ప్రాంతాన్ని ‘దేవభూమి’గా పిలుస్తారు.
లేడీ హైదరీ పార్క్: ఇది షిల్లాంగ్ సిటీ మధ్యభాగంలో ఉంది. ఏప్రిల్ - అక్టోబర్ మాసాలలో అందమైన పుష్పాలతో నిండి ఉంటుంది. ఇక్కడి ‘మినీ జూ’లో హిమాలయన్ బార్కింగ్ డీర్, బార్కింగ్ డీర్, స్లో-లోరిస్, బ్లాక్‌పాంథర్, లెపార్డ్, సిలెట్ వంటి అనేక జాతుల జంతువులు, అనేక పక్షులు ఉన్నాయి.
వార్డ్స్ లేక్: ఇది ఒకప్పటి అస్సాం - చీఫ్ కమీషనర్ పేరు మీద ఏర్పరచబడిన అందమైన మాన్-మేడ్ సరస్సు. ఇక్కడ చక్కటి బొటానికల్ గార్డెన్ ఉంది.
ఈగిల్ ఫాల్స్: ఇది షిల్లాంగ్ పట్టణం చివరన ఉన్న ఫాల్స్. ఈగిల్ (గద్ద) రెక్కల ఆకారంలో ఉండటంవల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
స్వీట్ ఫాల్స్: ఇది షిల్లాంగ్‌కు 8 కి.మీ. దూరంలో హ్యాపీ వాలీ వద్ద ఉంది. ఈ జలపాతం పెన్సిల్ మాదిరిగా ఉంటుంది. 200 మీ. ఎత్తు నుండి కిందికి ఉరుకుతుంది. ఇది మంచి పిక్నిక్ స్పాట్.
షిల్లాంగ్‌లో ఎక్కువగా వాన కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి చిరపుంజి ప్రాంతానికి చేరుకొని.. అక్కడ నుండి 8 కి.మీ. ట్రెక్కింగ్‌తో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.
లివింగ్ రూట్ బ్రిడ్జెస్: శ్రమకోర్చి కొండలు, గుట్టలు ఎక్కుతూ, దిగుతూ అడవిలో ప్రయాణిస్తే అద్భుతమైన ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఇక్కడి గిరిజనులు నదులు దాటడానికి ఫైకస్ ఎలాస్టికా అనే రబ్బర్ చెట్ల వేళ్లను ఆధారంగా వంతెనలు కట్టుకున్నారు. ఇవి పచ్చగా సింగిల్‌గా ఉన్నవి కొన్ని. మరికొన్ని డబుల్‌డెక్కర్ బ్రిడ్జిలు. వంతెనపై మరో వంతెనగా నిర్మించుకొన్నవి. ఈ చెట్ల వేళ్లను 20-25 సం.ల ట్రైనింగ్‌తో వంతెనలకు ఆధారంగా మళ్లించారు.
అనేక మంది ఒకేసారి వీటి మీదుగా నదిని దాటవచ్చు. ఇవ 53 అడుగులు, 70 అడుగులు, 100 అడుగుల ఎత్తున ఉండి దాదాపు 500 సంవత్సరాల దాకా నిరపాయంగా ఉంటాయట. ఇది గిరిపుత్రుల బయో ఇంజనీరింగ్ ప్రతిభకు చక్కని ఉదాహరణ.
ఇక్కడ నుంచి సిటీకి చీకటి పడేలోగా చేరుకోవాలి. లేకుంటే ప్రమాదం పొంచి ఉంటుందని గిరిపుత్రుల హెచ్చరిక. మూడు గంటలు ప్రయాణిస్తే చక్కటి రిసార్ట్స్ చేరుకోవచ్చు.
చిరపుంజి లోకల్ సైట్ సీయింగ్: చిరపుంజిని స్థానికులు ‘సోహ్రా’ అని పిలుస్తారు. ఇక్కడ ఏడాది వర్షపాతం 12063.3 మి.మీ. అమెరికాలోని హవాయ్‌లో 11680.0 మి.మీ. ఇప్పుడు ఈ రికార్డును చిరపుంజిలోని ‘మాసిన్‌రామ్’ నెలకొల్పింది. ఇక్కడ స్టాంక్‌టైట్, స్టాలగ్ మైట్‌తో ఏర్పడిన గుహలను చూడాల్సిందే.
ఇంత భారీ వర్షపాతం పడే ప్రాంతంలో ‘ఎడారి మొక్కలు’ ఆశ్చర్యం గొలుపుతాయి. ఈ పట్టణంలో విపరీతమైన జలాభావం. వర్షాలు ఎక్కువ కావటంవల్ల టాప్ ఫర్టెల్ సాయిల్ కొట్టుకొని పోయి సాయిల్ ఇరోజన్ జరగడంవల్ల ఎడారి మొక్కలు మాత్రమే ఇక్కడ ఉండటం మరో విశేషం.
‘డిమ్‌పెప్ వాలీ వ్యూ’ రామకృష్ణ మిషన్ మ్యూజియం, నోకాలికామ్ ఫాల్స్, లైటెడ్ మాస్ హై, గుహలు, ధంగ్‌భారంగ్ ఫాల్స్, కిన్‌రెమ్ ఫాల్స్, మాట్‌ట్రాప్ పిల్లర్ రాక్, నోసింగ్‌త్‌యాంగ్ ఫాల్స్ చూడాల్సిన ప్రాంతాలు.

-కె.సీత 9440587580