AADIVAVRAM - Others

శస్తచ్రికిత్స (శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశ్రుత ఆచార్యుడు - శస్త్ర చికిత్సకు తండ్రి. (క్రీ.పూ.600) సుశ్రుతుడు కేవలం శస్త్ర చికిత్సకే కాకుండా ప్లాస్టిక్ సర్జరీకి కూడా తండ్రి అనిపించుకున్నాడు. ముక్కును సరిచేయటం కోసం నుదుటి మీద ఒక చర్మపు ముక్కను తీసి, వేసి అతడు చేసే ప్లాస్టిక్ సర్జరీ చాలా నైపుణ్యంతో కూడినది. ఆ కాలంలో నేరానికి శిక్షగా కోసివేయబడిన ముక్కలను తిరిగి సరిదిద్దటం ఒక పనిగా చేసేవాడతను. అదే నైపుణ్యం ఈనాటికీ అదే విధంగా కొనసాగుతోంది.
సుశ్రుత ఆచార్యుడు, ప్రాచీన భారతదేశంలో నివసించిన శస్తచ్రికిత్స చేసే వైద్యుడు. ఆయన రాసిన సుశ్రుత సంహితలో అతడు మానవ శస్తచ్రికిత్సను ఎనిమిది తరగతులుగా వర్గీకరించాడు. ఈ గ్రంథంలో ఆయనే 120కి పైగా శస్తచ్రికిత్సా విధానాల గురించి వివరించాడు. సైన్స్‌కు మరియు శస్తచ్రికిత్స కళకు సంబంధించి అతడు ముందు తరాలకు స్ఫూర్తిదాయకంగా వుండే విధంగా చేసిన కృషికి మరియు అటు తర్వాత చేసిన అనేక విజయవంతమైన పరిశోధనల కారణంగానూ సుశ్రుతుడిని ‘్ఫదర్ ఆఫ్ సర్జరీ’ అని పిలవడం జరిగింది.
ఆధునిక శస్తచ్రికిత్సకు తన నూతన ఆవిష్కరణలతోను మరియు ఒక వైద్య గ్రంథం అల్-తస్రిఫ్‌ను రాసి సుగమమైన మార్గాన్ని ఏర్పరచిన ప్రథమ వ్యక్తి. వైద్యశాస్త్రంలోని వివిధ కోణాలను వివరించే 30 వాల్యూమ్‌లుగా రూపొందించబడింది.
ఇందులో ముఖ్యమైనవి శస్తచ్రికిత్సను గురించి వివరించిన మూడు పుస్తకాలు. వీటిలో అతడు రక్తస్రావాన్ని ఆపటానికి వాత పెట్టటం. బ్లాడర్ నుండి రాళ్లను తొలగించటం, జంతువులను కోయటం, మంత్రసాని పని, రక్తస్రావ నిరోధక మందు మరియు కన్ను, చెవి, గొంతుల శస్తచ్రికిత్సల గురించి అనేక కోణాలను వివరించటం జరిగింది. గర్భకోశం నుండి చనిపోయిన పిండాన్ని తొలగించడం, అంగాలను తొలగించి మిగతా శరీరాన్ని కాపాడటం వంటి అనేక శస్త్ర చికిత్సలను కచ్చితమైన, ఏ లోపం లేని విధంగా నిర్వహించిన వైనాలను కూడా ఈ పుస్తక భాగాలలో పొందుపరిచాడు.
అల్-జహ్రావి అనేక శస్తచ్రికిత్సలకు సంబంధించిన పరికరాలను, ఉపకరణాలను కూడా ఆవిష్కరించి రూపొందించటం జరిగింది.
అందులో కొన్ని ముఖ్యమైనవి - 1.చెవి లోపల పరీక్షించి చూడటానికి అనుకూలమైన పరికరం 2.మూత్రకోశం లోపల పరీక్షించటానికి అనువైన స్థానం 3.గొంతులో మందు రాయటానికి లేదా గొంతులో ఇరుక్కున్న ఏవైనా పదార్థాలను, వస్తువులను తొలగించటానికి ఉపయోగపడే సాధనం.

-బి.మాన్‌సింగ్ నాయక్