Others

సంపద పంపిణీలో తేడా ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? అది దేనికి? అది ఎవరి కోసం? ప్రాచీనకాలంలో మానవ సమూహాలు, మానవ గణాలు సమాజంగా పరిణామం చెంది స్థిరీకరణ జరుగుతున్న కా లంలో ఆ సమాజ సూత్రీకరణను అమలు పరచడానికి ఒక అధికార కేంద్రం అవసరం ఏర్పడింది. సమాజ విస్తృతిని బట్టి ‘రాజ్యం’ (స్టేట్) ఏర్పడింది. ఈ రాజ్యం కొన్ని ప్రాదేశిక పరిమితుల్లో వుంటుంది. అలాంటి ప్రాదేశిక పరిమితులకు లోబడి ఏర్పడిన రాజ్యానే్న ‘దేశం’ అంటాం. అటువంటి దేశంలో పరిపాలనకు అవసరమైన అధికార కేంద్రమే ‘ప్రభుత్వం’. ప్రాచీన కాలంలో ఇలాంటి అధికార కేంద్రం లేదా ప్రభుత్వమే రాజు లేక చక్రవర్తి, అతని పరివారం. రాజ్యానికి అధిపతి అయిన ‘రాజు’ ఎంపికలో కానీ, నియామకంలో కానీ ప్రజలకు ఎలాంటి ప్రమేయం ఉండదు. రాచరిక వ్యవస్థలో ఆ కుటుంబంలోని వారే అనువంశికంగా రాజ్యాధికారాన్ని పొందుతారు. వారిని ప్రజలు తమ పాలకునిగా అంగీకరిస్తారు.
ప్రాచీన కాలం నాటి రాచరిక వ్యవస్థలో ‘పాలన’ అంటే శాంతిభద్రతలను కాపాడడం, దేశాన్ని శత్రువుల నుండి రక్షించడం మాత్రమే. అలాంటి ప్రభుత్వం ప్రజల నుండి పన్నులు కూడా వసూలు చేస్తుంది. దేశంలోని సహజ వనరులను వీలైనంత మేరకు వినియోగిస్తుంది. ఇలా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించడం కోసం, రాజకుటుంబీకుల విలాసాల కోసం, యుద్ధాలు చేయడం కోసం వినియోగించేవారు. అంతేకాని ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం అంతగా కృషి చేసేవారు కాదు. ప్రాచీన కాలం నుండి మధ్యయుగాల చివరి వరకు రాచరిక వ్యవస్థలో ఇదే జరిగింది. ఆ తరువాత ఆధునిక యుగం ప్రారంభమయ్యాక ప్రపంచంలోని అధిక దేశాల ప్రజల్లో ముఖ్యంగా విద్యావంతుల్లో భావ చైతన్యం చిగురించడం మొదలైంది. ఈ భావ చైతన్యం కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో తమ ప్రమేయం వుండాలనే స్పృహ ప్రజల్లో పెరిగింది. వ్యక్తి స్వాతంత్య్ర భావనే ఇందుకు ప్రాతిపదిక! ఫ్రెంచి విప్లవంలో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భావజాలంలో ప్రజాప్రాతినిధ్యమున్న ప్రభుత్వాలు వివిధ దేశాల్లో ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన వాటిలో ఇంగ్లండు, అమెరికా ముఖ్యమైనవి.
స్వాతాంత్య్రానంతరం భారతదేశంలో కూడా ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన ప్రభుత్వాలు సక్రమంగానే పాలన చేస్తుంటాయా అనేది ప్రశ్న! మన దేశంలో ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తుంది. సహజ వనరులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెలికి తీసి ఉత్పత్తిని పెంచుతున్నారు. వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విద్య, వైద్యరంగాల్లో సదుపాయాలను పెంచుతున్నారు. ఈ విధంగా పలురకాలుగా దేశ సంపద, సంపత్తి పెరుగుతున్నది. ఇదంతా ఒక ఎత్తు. ఇలా పెరిగిన సంపదను ప్రజల మధ్య పంపిణీ చేయడం మరొక ఎత్తు. పెరిగిన, పెరుగుతున్న సంపద నిష్పాక్షికంగా వివిధ వర్గాల మధ్య సమానంగా పంచబడాలి. ఇలా పంపకం జరగకపోతే ఆర్థిక వ్యత్యాసాలు ప్రజల మధ్య పెచ్చుమీరుతాయి. ఆర్థిక వ్యత్యాసాలు సామాజిక అసమతుల్యతను పెంచుతాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నదిదే! ఈ దేశంలో గత కాలాల్లో జరిగింది కూడా ఇదే. తరాల తరబడి కొనసాగిన ఆర్థిక వ్యత్యాసాలు కొన్ని సామాజిక వర్గాల వెనుకబాటుతనానికీ, కులహీనతకు కారణమయ్యాయి. నేటి ఆధునిక కాలంలో కూడా సిద్ధాంతాల పేరుతోను, రాజకీయ ప్రయోజనాల కోసమూ ఇదే జరుగుతోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో అధిక సీట్లు వచ్చిన వారికి అధికారం దక్కుతుంది. అధికారమే పరమావధిగా పెట్టుకున్న రాజకీయ పార్టీల నాయకులు ఓట్లమీదనే నిరంతరం దృష్టి పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేస్తున్న ప్రజల మీద కాదు, వారి సంక్షేమంపై అంతకన్నా కాదు. ఓట్లను దండుకోవాలన్న యావతో పాలకులు కొన్ని అశాస్ర్తియమైన ఆర్థిక పద్ధతులను అవలంబిస్తున్నారు. ఏ మతంలో, ఏ కులంలో, ఏ వర్గంలో ఓటర్లు ఎక్కువ వుంటే వారికి రాయితీలను, ఆర్థిక పారితోషికాలను ఎన్నికల సమయంలో ప్రకటించడం ఆనవాయితీగా మారింది. అధికారంలోకి వచ్చాక- ఎన్నికల హామీలను, సమానతా సూత్రాలను నేతలు పక్కకుపెడుతున్నారు. ఏ వర్గం అయితే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ఆందోళనలు చేయగలదో అలాంటి వారికి అన్ని ఆర్థిక, సామాజిక హంగులను కల్పిస్తున్నారు. ఈ విధానంతో దేశంలో మెజారిటీ వర్గ ప్రజలు తాము పొందతగినవాటిని సైతం కోల్పోతున్నారు. ఇదే కాకుండా వ్యవస్థీకృతమైన సామ్య పంపణీ పద్ధతి లేకపోవడం వలన కూడా ఆర్థిక అంతరాలెక్కువ అవుతున్నాయి. ఉదాహరణకు సినీనటులు, విశేష ప్రతిభ చూపిన క్రీడాకారులు కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. అయినా వారికే ప్రభుత్వాలు భారీగా ప్రజాధనాన్ని నజరానాలుగా ఇస్తున్నాయి. ఈ దేశంలో ఉత్పత్తి, సంపద పెరగడానికి వీరు చేస్తున్నదేమిటో రైతులు, రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు చేయనిదేమిటో నేతలు చెబితే బాగుంటుంది!
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల ధనానికి, దేశ సంపదకు ట్రస్టీలుగా వ్యవహరించాలే తప్ప ఒకప్పటి చక్రవర్తుల్లా తమ ఇష్టం వచ్చిన విధంగా పంచిపెట్టకూడదు. అలా పంచిపెట్టేది ప్రభుత్వం అవుతుందా? విలాసవంతమైన నాలుగు భవనాలను కట్టి నాలుగు కుటుంబాలకిచ్చి వారికి కాస్త దూరంగా పది పూరిళ్లు కట్టి మిగిలినవారికి ఇచ్చారనుకుందాం. ‘ఆ భవనాల్లోనే పెరిగిన దేశ సంపదను చూడండి, పెరిగిన జిడిపిని వాటిలోనే చూడండి’ అంటే ఎలా? పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం ఆ భవనాల్లో నేతలకు కనిపించదు! ఇలాంటి లెక్కలు చెబుతున్నవారు తామే స్వయంగా దుకాణానికి వెళ్లి కూరలు కొంటే తెలుస్తుంది. దుకాణం వద్ద రెండు రకాల ప్రజలు కనిపిస్తారు. ఒక చిన్నసైజు వర్గం వారు ధరల గురించి ఆలోచించకుండా కిలోల లెక్కన కొనుక్కుని వెడతారు. మెజారిటీగా ఉన్నవారు మాత్రం ధరలను చూసి బిక్కుబిక్కుమంటూ పావుకేజీ, గ్రాముల లెక్కన కూరగాయలు తీసుకువెళ్లి సద్దుకుంటారు.ద్రవ్యోల్బణాలు, ఆర్థిక గణాంకాలు వారికి తెలియవు. ధర ఎంత అనేది మాత్రమే వారు చూడగలరు.
అందుకే- ‘గాలిలో లెక్కలు వద్దు.. నేలమీద లెక్కలు తెలియజెప్పండ’ని నేతలను మనం నిలదీయాలి. జిడిపి వంటి ఆర్థిక పరిభాష కాదు, అందరికీ అర్థమయ్యే పదాలతో చెప్పాలి. అన్నివర్గాలకూ సంపదను, అవకాశాలను సమానంగా పంపిణీ చేసేదే ప్రభుత్వం.

-మనె్న సత్యనారాయణ