Others

వృధా ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత టాలెంటున్నా సరైన పాత్రలు పడకపోతే వృధా అయిపోతుంది. నేను కూడా ప్రస్తుతం అలాగే అయిపోయాను. విచిత్రమేంటంటే మలయాళం నుంచి పరిచయమైన నాకు ఒక్క మంచి పాత్ర కూడా రాలేదంటే వింతగా ఉంటుంది. పరాయి భాషలైన తెలుగు, తమిళ భాషల్లో మంచి మంచి పాత్రలు పడ్డాయి. తెలుగులో మంచి నటిగా గుర్తించారు. ఎందుకో ఏమో మలయాళంలో మాత్రం నా ప్రతిభ అంతా వృధా అయిపోతున్నట్టు అనిపిస్తోంది. మాతృభాషలో గుర్తింపు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అంటోంది అందాల నటి పూర్ణ. ఆమె చెబుతుంది నిజమే మరి. మంచి నటిగా తెలుగులో గుర్తింపు ఉన్న పూర్ణ అడపాదడపా మంచి పాత్రల్లోనే నటించింది. మరి అవకాశాలు రాకపోవడానికి కారణమేమిటి? అంటే తాను నటించిన ఓ హారర్ చిత్రం చూసి ఎవరో చనిపోయారన్న టాక్ మల్లువుడ్‌లో బాగా ప్రచారం చేశారని, దాంతో కొన్ని అవకాశాలు వెనక్కిపోయాయని బాధపడుతోంది. ఎక్కడో ఏదో జరిగిందని, అది తనకు లింక్ పెట్టి సోషల్ మీడియాలో ఎగతాళి చేసే పద్ధతులను తానంటే ఇష్టపడనివాళ్లు చేస్తున్నారని, ఇలాంటివన్నీ ఎప్పటికి ఆగుతాయో తెలియడం లేదని బాధపడుతోంది పూర్ణ. ఇదిలావుంటే మరోవైపు ఇంట్లో పెళ్లి చేస్తామని అడుగుతున్నారని, తన టాలెంట్‌ను చూపించే పాత్రల్లో నటించకుండానే ఓ ఇంటిదాన్నైపోవడం ససేమిరా ఇష్టం లేదంటోందామె. మొత్తానికి పూర్ణ బాధను అర్ధంచేసుకుని మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు ఎవరైనా ముందుకొస్తే బాగుండు!