AADIVAVRAM - Others

సంతృప్తి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం నాలుగైంది. స్కూలు ఆటో అపార్ట్‌మెంట్ ముందు ఆగింది. ఐదవ తరగతి చదివే దివ్య తన లంచ్ బ్యాగ్, బుక్స్ బ్యాగ్ తీసుకుని వెళ్లబోతూ ఆటోలో వున్న తన స్నేహితులకు టాటా చెప్పింది.
అప్పటికే దివ్య కోసం ఎదురుచూస్తున్న శారదమ్మ మనవరాలిని చూసి ఆనందంగా ముద్దు పెట్టుకుంది. దివ్య స్నానం చేసి తయారై వచ్చేలోగా బిస్కెట్లు పాలు ఇచ్చింది. హోంవర్క్ కంప్లీట్ చేసుకుని ఆరు అవుతుండగా గడియారం వైపు చూసి ‘ఇంకెంతసేపు బామ్మా! అమ్మా నాన్నలు రావడం?’ అంటూ అడిగింది.
‘వచ్చేస్తూ ఉండొచ్చు. ఎందుకంత తొందర?’ అంది శారదమ్మ.
‘నా బర్త్‌డే ఈ వీక్‌లోనే ఉంది కదా. గిఫ్ట్స్ ఎప్పుడు తెస్తారు? కొత్త బట్టలు, కేక్ ఇంకా బోలెడు షాపింగ్ చెయ్యాలి కదా బామ్మా!’ అంది దివ్య.
‘ఎంత... ఒక్కరోజులో అన్నీ అవుతాయిలే గానీ ఈలోపు నువ్వు నీ స్నేహితులు ఎవరెవర్ని పిలవాలో లిస్ట్ వేసుకో’ అంటూ కొడుకు కోడలు వచ్చేవరకు ఏదో ఒకటి చెప్పి ఎదురుచూస్తూ దిగులు పడకుండా ఆపాలని చెప్పింది శారదమ్మ.
* * *
దివ్య బర్త్‌డే చాలా ఘనంగా జరిగింది. అందరూ కానుకలు ఇచ్చారు. ఒక నెల రోజుల పాటూ అన్ని బొమ్మలతో ఆడుకోవడంతో సమయమే తెలియలేదు దివ్యకు. మళ్లీ నిరాసక్తంగా బుగ్గమీద చేయి పెట్టుకుని సైలెంట్‌గా కూర్చుంది.
‘ఏమ్మా దివ్యా అలా ఉన్నావ్?’ అడిగింది శారదమ్మ.
‘మరే నా బొమ్మలన్నీ ఆడేసినవే. వాటితో ఆడుకోవాలంటే బోర్‌గా ఉంది ఆడుకోవడానికి. మళ్లీ కొత్త బొమ్మలు కొనుక్కోవాలి బామ్మా’ అంది దివ్య
‘అప్పుడే ఆడేశావా?’ ఆశ్చర్యంగా అంది శారదమ్మ.
‘ఒక్కొక్కరోజు ఒక్కొక్క బొమ్మ. అయిపోయింది’ చెప్పింది దివ్య సింపుల్‌గా.
‘సరే. ఒకసారి ఇలా రా’ అని తామున్న మూడవ అంతస్థు కిటికీలో నుంచి కిందకి చూపింది శారదమ్మ.
అక్కడ వాచ్‌మన్ వాళ్ల పిల్లాడు చక్రాలు ఊడిపోయి, లైట్లు లేని సొట్టలు పడ్డ ప్లాస్టిక్ కారు బొమ్మను దారానికి కట్టి తన వెంట బరబరా లాక్కుపోతూ సంబరపడిపోతున్నాడు.
‘వాడ్ని చూశావా?’ అంది శారదమ్మ.
‘ఆ... పాపం మనం పడేసే లాంటి బొమ్మతో ఆడుకుంటున్నాడు కదా?’ అంది చిరాగ్గా చూస్తూ జాలిగా.
‘ఈ రోజే కాదు. నేను రోజూ చూస్తున్నా. రెండు నెలలుగా ప్రతిరోజూ ఆ బొమ్మతో వాడు ఆడటం నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి చూస్తున్నా. అయినా వాడికి బోర్ లేదు చూశావా? ఇంకో బొమ్మ ఎవరైనా ఇచ్చేవరకూ అదే వాడికి ఆనందం. వాడితో పోల్చుకుంటే నీకు రెండు రాక్‌ల నిండా బొమ్మలున్నాయి. అయినా నువ్వు బోర్ అంటున్నావ్. ఇలా బొమ్మల కోసం పేచీ పెట్టి డబ్బులన్నీ దుబారా చేసేస్తే ఇంకా నీ బుక్స్, బట్టలు అన్నిటికీ కావాలి కదా?’ అని దివ్య వైపు చూసింది అర్థమైందా లేదా అన్నట్టు.
‘సారీ బామ్మా! ఇంకెప్పుడూ బొమ్మల కోసం పేచీ పెట్టను. నా పాత బొమ్మలు కొన్ని వాడికివ్వు బామ్మా. పాపం నేనూ బాగా చదవాలనేగా అడిగినపుడల్లా బొమ్మలు కొనిపెడ్తారు అమ్మానాన్న. నేను బొమ్మల గురించి ఎక్కువ ఆలోచించకుండా మంచి మార్కులు వచ్చినప్పుడు మాత్రమే కొనివ్వమంటాను. అప్పుడు వాళ్లు కూడా హ్యాపీగా ఫీలవుతారు’ మనస్ఫూర్తిగా అంది దివ్య.
సంతోషంతో తృప్తిగా తలాడించింది శారదమ్మ.

-డేగల అనితాసూరి