AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ కొడుకు కుశుడు విదర్భ రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. వారికి కుశాంగుడు, కుశనాభుడు, అధూర్త రాజశుడు, వసువు అనే నలుగురు కొడుకులు పుట్టారు. కొడుకులు నలుగురు నాలుగు పట్టణాలని నిర్మించి పాలనని చేపట్టారు. కుశాంగుడు కౌశాంబి నగరాన్ని, కుశనాభుడు మహోదయపురాన్ని, అధూర్త రాజశుడు ధర్మారణ్యం అనే నగరాన్ని, వసువు గిరివ్రజపురాన్ని నిర్మించారు. మనం ఉన్నది గిరివ్రజపురం. మగధ దేశంలోనే తూర్పు నించి పశ్చిమానికి ప్రవహించే శోణానది పుట్టింది. అది వసువుది.
కుశనాభుడికి ఘృతాచి అనే గంధర్వ స్ర్తి ద్వారా వందమంది కూతుళ్లు పుట్టారు. వారంతా ఓ రోజు ఉద్యానవన విహారం చేస్తూండగా వారిని చూసిన వాయుదేవుడు తనని పెళ్లి చేసుకోమని, మనుషుల్లో యవ్వనం త్వరగా పోతుందని, తనని పెళ్లి చేసుకుంటే దేవతా స్ర్తిలై శాశ్వత యవ్వనం పొందచ్చని వారికి చెప్పాడు.
‘మేమంతా మా తండ్రి కుశనాభుడి మాటని కాదని స్వేచ్ఛగా మేమే భర్తలని ఎన్నుకోం. వారు మమ్మల్ని ఎవరికి ఇచ్చి చేస్తే వారినే చేసుకుంటాం. నీకు శాపం పెట్టగలం. కాని ఆ పని చేయడం లేదు’ వారు బదులు చెప్పారు.
కోపం వచ్చిన వాయుదేవుడు వారిని గూని వాళ్లుగా చేశాడు. వాళ్లు అంతఃపురానికి తిరిగి వచ్చాక వాయుదేవుడికి, తమకి మధ్య జరిగింది తండ్రికి వివరించారు.
‘మీరు నా వంశ గౌరవాన్ని కాపాడారు. స్ర్తి పురుషులకి ఓర్పు అనేది అలంకారం. క్షమించడాన్ని అంతా చేయలేరు. రూపం, యవ్వనం లాంటివి గల దేవతలకి ఓర్పు తెలీదు’ కుశనాభుడు చెప్పాడు.
ఆయన వెంటనే మంత్రులను పిలిపించి కూతుళ్ల పెళ్లి గురించి ఆలోచించాడు.
విశ్వామిత్రుడు చెప్పేది రామలక్ష్మణులు ఆసక్తిగా వింటున్నారు.
‘రామా! నీకు చుళి అనే బ్రహ్మచారి అయిన తాపసి గురించి ఇక్కడ చెప్పాలి. అతను తపస్సు చేస్తూండగా ఊర్మిళ అనే అప్సరస స్ర్తి కూతురు సోమద అతనికి సేవ చేస్తూ ధర్మమార్గాన్ని అనుసరించేది. ఆ సేవకి సంతోషించిన చుళి ఓ రోజు ఆమెని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు.
తనని పెళ్లి చేసుకోమని ఆమె కోరింది. పెళ్లయ్యాక వారికి బ్రహ్మదత్తుడు అనే కొడుకు పుట్టాడు.
అతను కాంపిల్యా నగరంలో ఐశ్వర్యంతో జీవించసాగాడు. మళ్లీ కుశనాభుడి వంద మంది కూతుళ్ల దగ్గరికి వద్దాం. ఆయన వారందర్నీ బ్రహ్మదత్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడి స్పర్శకి అగ్నిదోషం తొలగి వారి గూనితనం మాయం అయింది. సోమద కూడా సంతోషించింది. తర్వాత కుశనాభుడు కొడుకు కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. యాగం జరిగేప్పుడు కుశనాభుడితో తండ్రి కుశుడు, అతనికి కొడుకు పుడతాడని, అతనికి గాధి అనే పేరు పెట్టమని సూచించాడు. రామా! ధర్మపరుడైన ఆ గాధి నా తండ్రే. కుశవంశంలో పుట్టడంతో నాకు కౌశికుడు అనే పేరు కూడా వచ్చింది. సత్యవతి నా అక్క. రుచికుడు నా బావ. పతివ్రత అయిన ఆమె కౌశికీ నదిగా హిమాలయాల్లో ప్రవహించడమే కాక సశరీరంతో భర్తతో స్వర్గానికి వెళ్లింది. నేను నా సోదరి మీద ప్రేమతో హిమాలయ పర్వత ప్రాంతంలో నివసిస్తున్నాను. యాగం కోసం నేను సిద్ధాశ్రమానికి వచ్చాను’
ఆ విధంగా విశ్వామిత్రుడు తన వంశకథని చెప్పాక మునులు విశ్వామిత్రుడితో ఇలా చెప్పారు.
‘కుశవంశం పూజింపతగ్గది. సదా ధర్మాన్ని పాటించే ఆ వంశస్థులు బ్రహ్మదేవుడితో సమానం. కుశవంశంలోని వారిలో ప్రత్యేకంగా నువ్వు బ్రహ్మసమానుడివి’
అప్పటికే అర్ధరాత్రి అవడంతో వారంతా శోణానదీ తీరంలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణులని నిద్ర లేపాడు. తిరిగి అంతా బయలుదేరి మధ్యాహ్నం హంసా, సారస పక్షులు గల గంగానది ఒడ్డుకి చేరుకున్నారు. వారు విశ్రమించాక రాముడు విశ్వామిత్రుడ్ని ఇలా అడిగాడు.
‘మూడు మార్గాల్లో ప్రవహించే గంగ గురించి చెప్పు. ఇది మూడు లోకాలని ఎలా ఆక్రమించి సముద్రంలోకి ఎలా కలుస్తోంది?’
‘సరే. విను రామా! పర్వతరాజు హిమవంతుడు అనేక ధాతువులకి గొప్ప నిధి. మేరు పర్వత రాజు కూతురు మనోరమ అతని భార్య. వారికి గంగ, మంగ అని ఇద్దరు కూతుళ్లు. రామా! వీరిద్దరూ లోకంలో పూజించబడేవారు. మూడు మార్గాల్లో ప్రవహించే గంగని తమ ప్రయోజనం నెరవేర్చుకోడానికి ఇవ్వమని దేవతలు కోరారు. హిమవంతుడు వారి కోరికని మన్నించి గంగని వారికి ఇచ్చి పంపాడు. రెండో కూతురు ఉగ్ర తపస్సు చేశాక ఆమెని రుద్రుడికి ఇచ్చి హిమవంతుడు పెళ్లి చేశాడు. గంగానది స్వర్గానికి వెళ్లాక సుర నదిగా మారింది. (బాలకాండ సర్గ 32-35)
ఇంటికి వచ్చాక తల్లి శారదాంబ అడిగితే ఆశే్లష తను విన్న కథని చెప్పాడు. ఆవిడ ఏడు తప్పులని సవరించింది. అవేమిటో మీరు కనుక్కోగలరా?

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.విష్ణువు ఆ వనంలో వందల కొద్దీ యుగాలు తపస్సు చేశాడు. సంవత్సరాలు కాదు.
2.సిద్ధాశ్రమంలో తపస్సు చేసింది కాశ్యపుడు. జమదగ్ని కాదు.
3.ఇంద్రుడు కాదు. అగ్నిదేవుడు, ఇతర దేవతలతో విష్ణువుని కలిసాడు.
4.ఇంద్రుడికి విష్ణువు ఇచ్చింది స్వర్గ్ధాపత్యాన్ని కాదు. ముల్లోకాధిపత్యాన్ని.
5.యజ్ఞం జరిగింది ఐదు రోజులు కాదు. ఆరు రోజులు. ఆరు రాత్రుళ్లు రామలక్ష్మణులు యాగాన్ని రక్షించారు.
6.రామలక్ష్మణులు ‘మేము వచ్చిన పనైంది. ఇక అయోధ్యకి బయలుదేరుతాం’ అనలేదు. ‘నీ సేవకులం. ఏం చేయాలో ఆజ్ఞాపించు’ అన్నారు.
7.ఆ వింటిని యజ్ఞానికి ప్రతిఫలంగా దేవతలని అడిగి తీసుకున్నది జనక మహారాజు కాదు. ఆయన పూర్వీకుడు దేవరాతుడు.

మీకో ప్రశ్నకి జవాబు
రామాయణం బాలకాండలో ముప్పైయ్యవ సర్గలోని పదిహేడో శ్లోకం రామాయణంలోని 1001వ శ్లోకం. స తేన అని ఆరంభమయ్యే ఈ శ్లోకంలోని స అక్షరం గాయత్రీ మంత్రంలోని రెండో అక్షరం.

మీకో ప్రశ్న
నదికి, నదానికి గల తేడా
మీకు తెలుసా?

మల్లాది వెంకట కృష్ణమూర్తి