AADIVAVRAM - Others

వేగం (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో వేగం పెరిగిపోయింది. రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. ఇది అందరూ అంటున్న మాట. ఇది సరైందేనని చాలామంది అంటూ ఉంటారు.
మనం నాలుగు లైన్ల రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రయాణం చాలా వేగంగా ఉంటుంది. మనం ఏదీ గమనించే అవకాశం ఉండదు. అలా కాకుండా రెండు వాహనాలు వెళ్లే రోడ్డులో ప్రయాణం చేస్తున్నప్పుడు అంత వేగం ఉండదు. చుట్టూ చూస్తూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
ఇలాంటి రోడ్డు మీద సాయంత్రం పూట ప్రయాణం చేస్తున్నప్పుడు అస్తమిస్తున్న సూర్యుడిని చూసే అవకాశం లభిస్తుంది. అదే విధంగా ఉదయం ప్రయాణం చేస్తున్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది.
ఎవరో తరుముతున్నట్టుగా ఉదయాన టీ తాగతాం. ఒక్కో గుటకని ఆనందిస్తూ తాగడం మర్చిపోయాం. అదే విధంగా టిఫిన్ చేస్తాం. ఒక్కో బుక్కని ఆనందంగా నములుతూ తినడం మానేశాం. ఎవరో తరుముతున్నట్టు భోజనాలు చేస్తుంటాం. కొంచెం మెల్లిగా ఆనందిస్తూ తినడం మనలో చాలామంది మర్చిపోయాం.
పిల్లలతో మన కాలాన్ని గడపడం తగ్గించేశాం. మనం వాళ్లకి చదువు చెప్పకపోయినా పర్వాలేదు. వాళ్ల పట్ల కొంత శ్రద్ధ వహిస్తున్నట్టు ప్రవర్తిస్తే చాలు. అంటే వాళ్లు చదువుకుంటున్నప్పుడు వాళ్ల పక్కన కూర్చుంటే చాలు. పిల్లల వయసుతో సంబంధం లేదు. కొంచెం పెద్దవాళ్లైనా పర్వాలేదు. వాళ్ల సబ్జెక్టు మీద మనకు అవగాహన లేకపోయినా పర్వాలేదు. మనం పక్కన కూర్చుంటే చాలు వాళ్ల చదువు వాళ్లు చదువుకుంటారు.
ఉత్తరాలు రాయడం తగ్గించేశాం. సంక్షిప్త సమాచారాలు, వాట్సప్‌లు, ఈమెయిల్స్ ఎక్కువై పోయాయి. కానీ ఉత్తరాలు ఇచ్చే ఆనందాన్ని ఇవి ఇవ్వవు. ఒక్కోసారి పాత ఉత్తరాలు చదివితే మనసు ఎక్కడికో పోతుంది.
మన ప్రయాణానికి నాలుగు లైన్ల రోడ్లు ఎంత అవసరమో, ఇరుకు రోడ్లు, రెండు లైన్ల రోడ్లు కూడా అంతే అవసరం. మనుషులకి ప్రకృతిని చూసే అవకాశం ఏర్పడుతుంది.
జీవితంలో నాలుగు లైన్ల రోడ్డులో ప్రయాణం వేగంగా ఉంటుంది. కానీ ప్రకృతిని చూసి ఆనందించకుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. రెండు లైన్ల రోడ్డులో ప్రయాణం చేస్తే ప్రకృతిని చూడవచ్చు ఆనందించవచ్చు.
జీవితంలో వేగం ఎంత అవసరమో మెల్లగా ప్రయాణం చేయడం అంతకన్నా ఎక్కువ అవసరం. వేగం తగ్గిస్తే గాలిని కూడా ఆస్వాదించగలం. మన నవ్వుని ఇతరులు స్వీకరించగలరు.
జీవితంలో ఈ చిన్నచిన్న ఆనందాలని మన పరుగు వేగంలో కోల్పోతున్నాం.