రుచి

ఆహారమేదైనా.. అవహేళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా మనవడు ఏడవ తరగతి చదువుతున్నాడు. ఒక రోజు స్కూల్‌నుంచి వచ్చి బ్యాగ్ సోఫాలో విసిరేసి ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమయిందిరా ఏడుస్తున్నావు అని అడిగాను. అమ్మమ్మా! నేను నాన్ వెజిటేరియన్ తిననందుకే సన్నగా బలహీనంగా ఉన్నానట.. స్కూల్‌లో నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పాడు. నేను రేపు మీ స్కూల్ హెడ్‌మాస్టర్‌ని కలిసి మాట్లాడతాను అని వాడికి సర్ది చెప్పాను. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఆహార పానీయాల విషయంలో ఎక్కడో ఎప్పుడో ఒకచోట ఎదుర్కొని ఉన్నవారమే.
మాంసాహారం తింటేనే గొప్ప బలవంతులుగా, శౌర్యవంతులుగా తయారవుతారు, శాఖాహారులు బలసీనంగా ఉంటారు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
పురాణ కాలంలో 21సార్లు దండయాత్ర చేసి రాజులను సంహరించిన పరశురాముడు, పాండవ కౌరవులకు యుద్ధవిద్యలు నేర్పించిన ద్రోణాచార్యుడు, మనుమసిద్ధి మహారాజువద్దవున్న మహా యోధుడు ఖడ్గ తిక్కన, పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక వహించి ఆత్మత్యాగం చేసిన గొప్పవీరుడు అనపోతు వీరందరూ శాఖాహారం తిన్నవారే.
కోడిరామమూర్తి నాయుడుగారు కేవలం కందిపప్పు, నెయ్యి తిని వ్యాయామం చేసి గొప్ప మల్లయుద్ధ వీరునిగా ప్రపంచ ఖ్యాతి గాంచి ‘కలియుగ భీమ’ అనే బిరుదును పొందారు.
మనదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారితో పోరాడిన చాలామంది సమర యోధులలో శాఖాహారులు చాలామంది ఉన్నారు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, ఇంకా మనకు తెలియని ఎంతోమంది ఉన్నారు.
ప్రపంచంలో దాదాపు 95 శాతంమంది మాంసాహారాన్ని, శాఖాహారాన్ని తింటుంటే, 5 శాతం మంది మాత్రమే పూర్తిగా శాఖాహారం మీద ఆధారపడి కేవలం వృక్ష సంబంధమైన ఆహార పదార్ధాలపైన, పాలు, పాల పదార్ధాలను తింటూ జీవనం సాగిస్తున్నారు.
ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మాంసాహారాన్ని భుజించే వారిలో కూడా ఇలాంటి వేదింపులకు గురి అవుతున్నారు. కొద్దిమంది మాత్రమే వున్న శాఖాహారులను కించపరచకుండా వారి మనోభావాలకు ఇబ్బంది కలగకుండా అందరూ కలిసి జీవనం సాగించాలి.
తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఈ తరం విద్యార్థులకు చిన్నప్పటినుంచి సహ జీవన విధానం తెలియజేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి నడిపించాలి.

-జన్నాభట్ల లక్ష్మీ కామేశ్వరి