AADIVAVRAM - Others

శిలాజాలు (శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిలాజాల సిద్ధాంతాన్ని మొదట కనుగొన్నది నికోలస్ స్టెనో. దీనిపై ఆయన సిద్ధాంత పత్రం ‘ప్రోడ్రోమస్’ 1669లో నమోదయింది. ఆధునిక భూగర్భ శాస్త్రం అభివృద్ధికి ఆయన సిద్ధాంతం మార్గదర్శకంగా ఉంది.
డానిష్ భూగర్భ శాస్తవ్రేత్త తిమింగలం పళ్లను పరిశీలించినప్పుడల్లా రాళ్లలో అదే విధమైన స్వరూపాలు ఆయనకు గుర్తుకొచ్చేవి. అవి రాళ్లు కావని, తిమింగలాలు నీటిలో కొట్టుకొచ్చి మరణించి అలా మారి ఉంటాయని ఆయన గుర్తించాడు. ఒకప్పుడు ద్రవ రూపంలో ఉన్నది ఎలా ఘనీభవించి గట్టి రాతి రూపంలోకి వచ్చిందో ఆయన కనుగొన్నారు. తిమింగలం పళ్లను ద్రవంలో ఉంచితే కొనే్నళ్లకు ఆ ద్రవం గట్టిపడి శిలాజాలుగా మారుతాయని ఆయన తెలుసుకుని శాస్త్ర ప్రపంచానికి తెలియజెప్పారు.
పరమ శూన్యం
పరమ శూన్య ఉష్ణోగ్రత అన్న భావనను 1665లోనే రాబర్ట్ బాయిల్ మొట్టమొదట ప్రతిపాదించాడు. అయితే 1848లో లార్డ్ కెల్విన్ ఇందుకోసం ఒక కొలతను అభివృద్ధి చేసిన తరువాత గాని పరమశూన్య ఉష్ణోగ్రతకు ప్రాముఖ్యత లభించలేదు.
విలియం థామ్సన్, లార్డ్స్‌కు చెందిన స్కాటిష్ దేశ శాస్తవ్రేత్త, ఇంజనీర్ బారన్ కెల్విన్ ఉష్ణం, విద్యుత్, పదార్థపు ఏకధర్మ గూర్చిన పరిశోధనలు చేశారు. ఆయన కృషి తరువాతి రోజుల్లో పరమాణు భౌతిక శాస్త్రంలో విప్లవాలకు కారణమైంది.
సాధ్యపడిన అతి తక్కువ ఉష్ణోగ్రతను పరమ శూన్యంగా గుర్తించి ప్రకటించటం కోసం ఓ స్కేలు అవసరమని కెల్విన్ భావించాడు. నీరు ఘనీభవించే, స్పష్టంగా చెప్పాలంటే అది ఒకేసారి ఘనరూపం - ద్రవం - వాయువుగా ఉండే ట్రిపులింగ్ పాయింట్ 273.16 కెల్విన్లుగా నమోదయింది. ఇది ‘0’ డిగ్రీల సెంటీగ్రేడ్, 32 డిగ్రీల ఫారిన్ హీట్‌కు సమానం. కెల్విన్ అన్నది ఉష్ణానికి సంబంధించి శాస్ర్తియమైన కొలమానంగా రూపొందింది. ప్రత్యేకించి నక్షత్రాల వంటి అత్యధిక ఉష్ణోగ్రతలు పరమాణుల్లో చర్యలు నెమ్మదించే అతి తక్కువ ఉష్ణోగ్రతలను సూచించేందుకు కెల్విన్‌ను ఉపయోగిస్తున్నారు.
ఒక వస్తువు చల్లబడుతున్న కొలదీ దానిలోని అణువుల చలనం నెమ్మదిస్తుంది. పరమ శూన్యం వద్ద ఈ చలనం అతి తక్కువకు చేరుకుంటుంది. అసలు చలనం మొత్తంగానే నిలిచిపోతుందన్నది మరి కొందరు శాస్తవ్రేత్తల వాదన. ఈ విధంగా కెల్విన్ స్కేలు పైన పరమశూన్య ఉష్ణోగ్రత - 273.150 డిగ్రీల సెల్సియస్. ఫారన్‌హీట్ కొలతలో ఇది 469.67 డిగ్రీలు.

-బి.మాన్‌సింగ్ నాయక్