Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ వెతలనొందెడి వారికీవేగ బంధు
వన్నను స్నేహితుడవన్న వరమువన్న
నట్టివారికి సకలమ్ము నరయనీవె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం:ఎన్నో బాధలు పడేవారికి బంధువువన్నా, స్నేహితుడవన్నా, అలాంటివాళ్ల పాలిటి వరానివన్నా ఒక్కమాటలో చెప్పాలంటే అంతా నీవే అయిన ఓ కర్మసాక్షీ! సూర్యదేవా! ఆదుకవయ్యా ప్రభూ!
తే.గీ ఎన్నియో సమస్యలతోడ నెల్లజనులు
విలవిలంగొట్టుకొనుచుండిరిలనుఁగనగ
నట్టి యెడదలకుపశమనమ్ము నిడుచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!
భావం: భూజనులంతా ఎనె్నన్నో సమస్యలతో విలవిలా కొట్టుకుంటున్నారే! అలాంటివారి హృదయాలకు కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఉపశమనాన్ని చేకూర్చుమో ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262