AADIVAVRAM - Others

అతనే మహావృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ విత్తనం
మొక్క కాలేకపోవచ్చు! కానీ...
తోటమాలి తన మనసు చెలమలోని
నీళ్లను చేదిపోస్తే...?
హృదయ నవనీతంతో
మృదువుగా సాకితే...?
ఏ విత్తనమైనా మొలకెత్తాల్సిందే
మొక్కై...మహావృక్షమై...
నలుగురికి పలు రకాలుగా
ఫలితమందించాల్సిందే
తోటమాలి చెమటదే పై చేయి
మొక్క మహావృక్షం కావడంలో
తన వెన్ను ఒంగుతున్నా
మొక్కను ఒంగనివ్వని
నిటారు మనస్కుడతడు
వేళ్లల్లో నీటితో పాటు
కాండం నుండి చిటారు చిగురు వరకు
ప్రేమనూ చిలకరిస్తాడు
మమతల బంధాన్ని అంటుకట్టించి
ఆత్మీయ ఫలాలను కాయిస్తాడు
పక్షులకు గూడు కావడంలో
చెట్టు గొప్పతనమేముంది?
గుండె గూటిలో నుండి
వేళ్లూనుకున్న మనిషితత్వందే
నిలువెత్తు గొప్పతనం
జీవులకు గొడుగవ్వడంలో
వృక్షం చేసే సాయమేముంది?
హృదయ పొత్తంలో చేయూతున్న
మానవత్వపు అధ్యాయలదే
చల్లచల్లని అందలం
అట్టడుగునున్న వారికి
ఆకాశాన్ని అందించడమే తోటమాలితనం
మొక్కను మహావృక్షం చేసే పరోపకారత్వం
*

-డాక్టర్ పెంకి విజయ కుమార్, 9553392949