AADIVAVRAM - Others

ప్రభుత్వ ఉన్నతాధికారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
**
న్యాయ కోవిదుడు ఎస్.రామచందర్‌రావు చేసిన తీవ్రమైన విమర్శలు మీకు అర్థం అవ్వాలంటే రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన సూత్రాలను అర్థం చేసుకోవాలి.
కింది ఆర్టికల్స్ 54, 57, 74 మరియు 75 అధ్యక్షుని ఎన్నిక, ప్రధానమంత్రిని మరియు మంత్రుల మండలిని అధ్యక్షుడు నియమించే విధానాన్ని నిర్దేశిస్తాయి. ఆర్టికల్ 144 న్యాయ వ్యవస్థ లేదా కోర్టు ఆదేశాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ యొక్క విధులను నిర్దేశిస్తుంది.
ఆర్టికల్ 54. రాష్టప్రతి ఎన్నిక
పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నికైన సభ్యులు, మరియు రాష్ట్రాల శాసనసభలో ఎన్నికైన సభ్యులతో కూడిన ఎన్నికగణం లేక నియోజకవర్గ గణం నుండి రాష్టప్రతి ఎన్నుకోబడతారు.
ఆర్టికల్ 57. తిరిగి ఎన్నికలకు అర్హత
మెరుగైన పాలనకు ప్రత్యామ్నాయం లేనప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎన్నికైన కార్యాలయాలకు కాల పరిమితుల గురించి పెద్దగా ఆసక్తి చూపరు. ఈ ప్రతిపాదనలను అన్ని పార్టీలకు మరింత ఆకర్షణీయంగా మరియు సరసమైనవిగా చేయడానికి, ప్రతిపాదనలను శాసించిన తరువాత కార్యాలయంలో గడిపిన సమయం మాత్రమే పదవిలో ఉన్న మొత్తం కాలాన్ని అంచనా వేయడానికి ఆధారంగా ఉండాలి.
రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి ప్రస్తుతం అధ్యక్షుడిగా పదవిలో ఉన్న, లేదా గతంలో ఆ పదవి నిర్వహించిన వ్యక్తి అయినా ఆ కార్యాలయానికి ఎన్నికకు తిరిగి అర్హులు.
మెజారిటీ పార్టీ సభ్యులు ప్రధానిని ఎన్నుకుంటారు. వాస్తవానికి పార్టీలోని సీనియర్ సభ్యులు ‘కింగ్’ మేకర్స్ వారు ఒక వైపు పార్టీ సభ్యులను అదుపులో ఉంచుతారు. మరోవైపు ప్రధానిని నియంత్రిస్తారు. ఈవిధంగా ప్రధాని మనుగడ చాలా సున్నితంగా పార్టీ సభ్యులను సంతోషంగా ఉంచడంపై ఆధారపడి ఉంటుంది. దాని అర్థం పార్టీ స్థాయి లేదా ప్రభుత్వ స్థాయి స్థానాలు ఇవ్వటం. సీనియర్ నాయకులు తమకన్నా తక్కువ క్యాడర్‌లోని పార్టీ సభ్యులను ఎంత సమర్థవంతంగా అదుపులో ఉంచుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ మనుగడ అంటే ఒక వైపు, దేశశ్రేయస్సు మరొక వైపు, ప్రజా నిధుల వినియోగం వాటి మధ్య ఘర్షణ, డబ్బు ఎక్కడికి పోతుంది అంటే ఏ వైపు బలం ఎక్కువ ఉందో ఆ వైపు. ప్రజా నిధులు ఒక తాడు వంటివి బలంగా లాగగలిగిన గుంపుకే సొంతమవుతాయి.
ఆర్టికల్ 74. మంత్రిమండలి నియామకం
రాష్టప్రతికి సలహాలు సహాయాలు అందించడానికి ప్రధానమంత్రి ముఖ్య అధికారిగా ఒక మంత్రిమండలి ఉండాలి. రాష్టప్రతి తన విధులను నిర్వర్తించటానికి సలహా సహాకారాలు అందించాలి. అటువంటి సలహాలను సాధారణ లేదా బహిరంగమైన కారణాల వలన గానీ ఇతరత్రా పరిస్థితుల కారణంగా గానీ పునఃపరిశీలించమని రాష్టప్రతి మంత్రి మండలిని కోరవచ్చు. మరియు అటువంటి పునరాలోచన తర్వాత ఇచ్చిన సలహాకు అనుగుణంగా రాష్టప్రతి వ్యవహరించాలి. అందువల్ల కార్యనిర్వాహఖ అధికారం ప్రధానమంత్రి వద్ద ఉంటుంది అనేది గమనార్హం.
మంత్రులు రాష్టప్రతికి సలహా ఏమైనా ఇచ్చారా అనేది గానీ లేదా ఇచ్చిన సలహాల వివరాలు గానీ ఏ కోర్టులోనూ విచారణ చేయరాదు.
ఆర్టికల్ 75. మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు
ప్రధానమంత్రిని రాష్టప్రతి నియమిస్తారు. మరియు ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను రాష్టప్రతి నియమిస్తారు.
మంత్రిమండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదు.
ఆ సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హులైన ఏ రాజకీయ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కూడా మంత్రిగా నియమించబడటానికి అనర్హులు. అతని అనర్హత, మొదలుపెట్టిన తేదీ నుండి సభ్యునిగా తన పదవీకాలం గడువు ముగిసే తేదీ వరకు లేదా ఆ తేదీ లోపు అతను పార్లమెంటు సభకు ఏదైనా ఎన్నికలలో పోటీ చేస్తే, ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రకటించిన తేదీ వరకు అంటే ఈ రెండింటిలో ముందు వచ్చే రోజు లేక తేదీను అనుసరించి నిర్ణయించబడుతుంది.
రాష్టప్రతి ఇష్ట ప్రకారం మాత్రమే మంత్రులు పదవిలో ఉంటారు. మంత్రిమండలి లోక్‌సభకు సమిష్టిగా బాధ్యత వహించి ఉంటుంది. ఒక మంత్రి తన పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు, రాష్టప్రతి ఆయనకు పదవీ బాధ్యత మరియు గోప్యత గురించిన ప్రమాణ స్వీకారం ఇవ్వాలి. వరుసగా ఆరు నెలల వ్యవధిలో పార్లమెంటులో సభ్యుడు కాలేని మంత్రి ఆ కాలం ముగిసే సమయానికి మంత్రి పదవి కోల్పోతాడు. మంత్రుల జీతభత్యాలు ఎప్పటికప్పుడు పార్లమెంటు చట్ట ప్రకారం నిర్ణయించబడతాయి.
ఆర్టికల్ 144
భారత భూభాగంలో ఉన్న సివిల్ మరియు జ్యుడీషియల్ అధికారులందరూ సుప్రీంకోర్టుకు సహాయకారులుగా వ్యవహరించాలి.ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు స్థాపన లేదా ఏర్పాటుకు సంబంధించినది. రాజ్యాంగంలోని ఇతర ఆర్టికల్స్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఉద్దేశించి చాలా పుస్తకాలే ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రాసిక్యూషన్ ముందు అనుమతి:
ఆర్టికల్ 144
ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు ముందస్తుగా పై అధికారి అనుమతి కావాలి అనే నియామకం సత్యాన్ని నిర్ధారణ చేయడానికి నియమించబడ్డ దర్యాప్తు సంస్థల బాధ్యతలను అడ్డుకుంటుంది. అంటే ముందుకు వెళ్లడానికి అనుమతించదు. ఇది న్యాయ స్థాపన కోసం వేయవలసిన ముందడుగు, సుప్రీంకోర్టు మరియు న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం.
ఈ నియామకం న్యాయస్థాపనను అడ్డుకోవటానికి ఉపయోగపడే సాధనంగా మారింది మరియు ఆర్టికల్ 144తో జోక్యం చేసుకుంటుంది అంటే అడ్డుకుంటుంది.
చట్టం అమలు చేయు మరియు పరిశోధనా విభాగాల దుస్థితి ఏమిటంటే దేశ ప్రయోజనాలకు బదులు వారి స్వప్రయోజనాలు చూసుకునే ఉద్యోగి యొక్క పర్యవేక్షకుల దయా దాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటుంది.
(ఇంకా ఉంది)

- ఆనంద్ గరికపాటి