Others

మూత్రపిండాలను కాపాడుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం
*
మానవ శరీరంలో ద్రవాలను వడపోసే అత్యంత ముఖ్యమైన భాగంగా కిడ్నీ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. రక్తంలో చేరే మలినాలను, ప్రమాదకర పదార్థాలను శుద్ధిచేసి బయటకు పంపే శరీర అవయవాలలో కిడ్నీ కీలకమైంది. దాని పనితీరు ఆధారంగా మిగతా శరీర భాగాలు సమతుల్యం చెంది సమర్థవంతంగా పనిచేసి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుతకాలంలో అత్యాధునిక వైద్యపద్ధతులు ఎన్ని వచ్చినా ఆందోళన కలిగించే అసంకామ్యత దీర్ఘకాల వ్యాధుల జాబితాలో కిడ్నీ సమస్య ఒకటి ప్రపంచ వ్యాప్తంగా వేధిస్తుంది. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా, ప్రధానంగా జీవన విధానంలో మార్పులు, నొప్పుల మాత్రలు ఎక్కువగా వాడటం, అధిక రక్తపోటు, షుగరు, గాలి, నీరు కాలుష్యం మొదలైనవి ప్రధానం. అదేవిధంగా శరీరంలో వేరే అవయవాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కూడా ఆ ప్రభావం కిడ్నీమీద పడి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
దేశంలో ఏటా రెండు లక్షలమంది కొత్తగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నట్లు అంచనా. మన దేశంలో 10 కోట్లమంది కిడ్నీ బాధితులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 850 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిఏటా దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో 2.4 మిలియన్లమంది చనిపోతున్నట్టు అంచనా. ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ వ్యాధిగ్రస్థులుగా ఉన్నారు. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కిడ్నీ సమస్యలు (క్రానిక్ కిడ్నీ డిసీస్) వేధిస్తున్న నేపథ్యంలో 2040 నాటికి ప్రపంచ మరణాలలో 5వ స్థానాన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులే ఆక్రమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధిక ఆదాయ దేశాల్లో ఏటా డయాలిస్ మరియు కిడ్నీ మార్పిడికై వారి ఆరోగ్య బడ్జెట్‌లో 2-3 శాతం వినియోగించగా, మొత్తం ఆ దేశాల జనాభా పెడుతున్న ఖర్చు 0.03 శాతంకన్నా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో మధ్యస్థ మరియు తక్కువ ఆదాయం వున్న దేశాల్లో కిడ్నీ వైఫల్యానికి గురైనపుడు డయాలసిస్ మరియు కిడ్నీ మార్పిడి అవకాశాలు సరైన రీతిలో అందుబాటులో లేక ప్రాణ రక్షణ కరువై మరణానికి దగ్గరవుతున్నారనేది భయాందోళన కలిగించే విషయం.
ఇటీవల సైలెంట్ కిల్లర్‌గా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతున్నందువల్ల అంతర్జాతీయంగా వైద్య విభాగం అప్రమత్తమై ప్రజల్లో అవగాహనకు నడుం బిగించింది. ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ సొసైటీ మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ‘వరల్డ్ కిడ్నీ డే’ను నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ డేగా నిర్వహిస్తున్నారు. ఏటా ఒక నినాదంతో అవగాహన కలిగిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ ఫౌండేషన్ ‘ఆరోగ్యవంతమైన కిడ్నీల కొరకు ప్రతి ఒక్కరికి, ప్రతిచోట గుర్తించడం నుండి నివారణ వరకు సమాన రక్షణ కల్పించాలి’ (కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీవేర్ ప్రివెన్షన్ టు డిటెక్షన్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్) అనే నినాదంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం, మన దేశంలో 16 శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీ వైఫల్యం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి, రెండు దశల్లో వున్నప్పుడు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తే తప్ప లక్షణాలు కనిపించవు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, అధిక బరువు, గతంలో కిడ్నీలో రాళ్లు వున్నవారు, వారసత్వంగా సమస్య వున్నవారు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని గుర్తించవచ్చు. మూడో దశలో కాళ్లు వాపు, రక్తహీనత, రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువమంది ఈ దశ వచ్చేవరకు సమస్యను గుర్తించలేరు. ఈ దశలో నిర్లక్ష్యం చేసినా, గుర్తించకపోయినా నాలుగో దశలో పరిస్థితి తీవ్రమై కిడ్నీ పనితీరు ఆగిపోయి క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా మారుతుంది. ఆకలి మందగించడం, ఆయాసం, వాంతులు, ఒంటో నీరు చేరడం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ దశలో డయాలసిస్ చేయాలి లేదా కిడ్నీ మార్చాలి, లేదంటే సమస్య తీవ్రమై రోగి మరణించడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల లక్షణాలను తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం వుంది. కిడ్నీ సమస్యలపై వైద్య బృందం ఈవిధంగా వివరించడం జరిగింది. మూత్రపిండాల పనితీరు మందగిస్తుంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి మరియు కిడ్నీల పనితీరు మారుతుంది లేదా కిడ్నీలు చెడిపోతాయి. రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన వెళ్లాల్సి వస్తుంది. కడుపులో వికారంగా వుంటుంది. వాంతులవుతుంటాయి. ఆకలి మంగదిస్తుంది. తరచూ జ్వరం వస్తుంది. రక్తహీనత, రక్తపోటు పెరుగుతాయి. ఆయాసం, నీరసం పెరుగుతాయి. ఎముకల నొప్పులు, శరీరం పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. మూత్రం సరిగా రాదు. కావున వైద్యుల సలహా మేరకు కిడ్నీవ్యాధి వున్నవారు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. బిపి, షుగర్ వున్నవారు అదుపులో ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి. మాంసాహార ప్రొటీన్లవల్ల కిడ్నీపై ఎక్కువ భారం పడుతుంది. శాఖాహారమే మంచిది. ఉప్పు, పసుపులను ఎక్కువగా తీసుకోకూడదు. బీపీ పెరిగి కిడ్నీలపై భారం పడుతుంది. అధిక బరువు కూడా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. కాఫీ, టీలు మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా వుండాలి. భారతదేశంలో ఏటికేడు కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డయాలిసిస్ కేంద్రాలను విస్తృత స్థాయిలో ఏర్పాటుచేయాలి. శుద్ధిచేసిన మంచినీటిని ప్రతి కుటుంబానికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. కిడ్నీ సమస్యల నివారణకై పాఠశాల స్థాయి విద్యార్థులకు ‘నీటి గంట’ కార్యక్రమాన్ని సమర్థవతంగా అమలుచేయాలి. అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి కిడ్నీ సమస్యలపై ప్రాథమిక ఆరోగ్య బృందం ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి.

- సంపతి రమేష్ మహరాజ్ 99595 56367