Others

పోషక పదార్థాలు ఇవ్వాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు మొదటి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పోషక విలువలతో, ఖనిజాలతో కూడిన ఆహారం వాళ్ళకి పెట్టాలి. అలా చేయడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. శరీరం బలవర్ధకంగా ఉండటానికి కొన్ని రకాలైన ఆహారాలు తప్పనిసరి. తిండి విషయంలో పిల్లల ఇష్టాలను పరిగణనలోకి తీసుకుంటూనే వాటిల్లో పోషక విలువలు ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. పిల్లలకు అల్పాహారంగా ఇడ్లీ, కిచిడి, ఓట్స్, ఉప్మా వంటివి ఇవ్వాలి. ఎందుకంటే ఇవి శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను అందిస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రోజూ పెడుతూ ఉండాలి. కొంతమంది పిల్లలకు ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తినే అలవాటు ఉంటుంది. అలా కాకుండా పిల్లలకు రోజులో ఐదారు సార్లు కొద్దికొద్దిగా ఆహారం పెడితే మంచిది. అలాగే రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డును ఇవ్వాలి. కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, పండ్లు, చేపలు వంటివి ఎదిగే పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే వీటి ద్వారా పిల్లలకు కావలసిన విటమిన్లు, మినరల్స్, పోషకాలు అందుతాయి. అంతేకాదు పండ్లలో, ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లోని మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.