AADIVAVRAM - Others

మృచ్ఛకటికమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీకు నాకు మధ్య మాటల యుద్ధం ఎందుకు?
మనకూ మనసుకూ మధ్య రాతిగోడల గురించి చేర్చించుకుందాం!
ఘనీభవించిన శిలాజాలు
గుండె పాత్రలో ఉడికిపోతున్న
విభిన్న ఆమ్లాలు!
టెస్ట్‌ట్యూబ్‌ల నిండా పరీక్షలకు
ఎదురుచూస్తున్న యెర్ర, తెల్ల కణాలు
మళ్ళా మళ్ళా మనదే వంతు
క్షణ క్షణం మారుతున్న తంతు! ఎక్కడుందని వెతుకుతావు రచ్చబండ?
కరిగిపోతోంది నీ నా గుండె కండ!
భాషోద్యమాలు గడ్డకట్టుకుపోయాయి!
భావోద్రేకాలు కంఠసర్పికి బలైపోయాయి!
చూచావా!
వాడెవడో గోడమీది నుంచి నిక్కి నిక్కి చూస్తున్న ముష్కరత్వం!
కుక్కిన పేనులా ఉండవలసిన వాడు దుక్కలా మారటానికి మనమేగా కారణం!
ఏడు దశాబ్దాల మానసిక బంధాలు..
వీడిపోతున్న జాడల ముడులు
రావణకాష్టం ఇంకా తగలబడుతూనే ఉంది
కాలకేయుడు సమిధలూ వేసి
చలి కాచుకుంటున్నాడు
భృగుమధ్యస్థానం నుండి నీ జ్ఞాననేత్రం శిరస్సుకు వలసపోవటం నిజం!
భంగపడుతున్న నీ కుతంత్రాల ఆలోచన్లు
బెంగపెట్టుకున్న గుండెల్ని కరిగించవేమో?
మన చుట్టూ కోటకట్టుకుని
ఊపిరాడటంలేదంటే ఎలాగ మిత్రమా!
గోడలు పగులకొట్టాలన్నా - పలుగు పారా తాకట్టులో ఉందికదా! ఎలా?
ఒకప్పుడేమో అక్షరాల కోసం కొట్టుకున్నాం!
మరిప్పుడో? ఈర్ష్యాద్వేషాలతో తిట్టుకుంటున్నాం!
అప్పటికి - ఇప్పటికి ఏం మారిందని?
కప్పల తక్కిట చేతపట్టుకుని కప్పదాట్లు
నేర్చుకుంటున్నాం!
ఎక్కడ ఈ విశ్వం కుంచితత్వంతో ముక్కలు ముక్కలు చేయబడదో అక్కడే నిజమైన స్వాతంత్య్రం అన్న విశ్వకవి
ఇక్కడి ప్రాంతీయ మూడుముక్కలాట
చూసి ముక్కున వేలేసుకుంటున్నాడు
ఇదేమి వికర్షణ? వికటిత వికృత నటన...
నిశ్శబ్దపు హృదయ స్పందన!
ఊపిర్లు విడుస్తున్న లావా జ్వలన!
రోజూ భయంతో ఇంకెన్నాళ్లు జీవించగలం?
జనద్రోహం చేస్తూ జీవచ్ఛవాలమై మరణిస్తాం
తెలుగు తల్లి శాపం వెన్నాడుతోంది స్నేహితుడా!
తెలుగు నేల నెర్రెల్లో విషనాగుల
పూత్కారం వినిపిస్తోంది మిత్రుడా!
కారణకారణాలతో ప్రవాహం ఎడారిలో ఇంకకూడదు
ఈ నేల బిడారులకు నెలవు కాకూడదు
మనతోనే తెలుగు వెలుగుల ప్రస్థానం!
మనసులు ముడిపడితేనే నవయుగ
ఆవిష్కరణం!!

-బి.ఎస్. నారాయణ దుర్గా భట్ 9346911199