Others

అంతమైపోతున్న అమ్మతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో సగం
ఆకలి దుప్పటి కప్పుకొని
నడి రోడ్డుపై
కూడలిలో
విసిరేసిన మెతుకులకు
ఆమె ఓ కేర్ ఆఫ్ అడ్రస్

33 శాతాల రిజర్వేషన్‌లు
అడుగింటిన జీవితపు ఆశల వత్తిని
వెలిగించలేవు
కట్న చావులు
వివక్ష అహంకారాలు
రక్త నదులై ఈ దేశం
నిండా ప్రవహిస్తున్నాయి

దేశం ముందుకెళ్తున్నా
ప్లస్‌లు మైనస్‌ల లెక్కల్లో
ఎన్ని తరాలో
అంతరించిపోతున్నాయి
లింగ నిర్థారణలో
ఆడ నలుసుని
పీక నొక్కేస్తున్న
అభివృద్ధి

చావడానికి మాత్రమే
పుట్టిన లక్ష్మిలు
సరస్వతులు, ఒకటా రెండా
లెక్కకు అందని
సామూహిక హత్యలు..

కాలగమనంలో
స్ర్తితత్వం నశిస్తే
సృష్టికి
సంపూర్ణత్వం దొరకని అద్వానపు
యుగంలో కొట్టుకుపోతాము
మేలుకొని రక్షించుకుందాం
అమ్మతనాన్ని, మానవత్వాన్ని

చీకటిని చీల్చే రేపటి కోసం
మరో కొత్త సమ సమాజంకై
పరిగెడదాము

-పుష్యమీ సాగర్