సబ్ ఫీచర్

నీ ప్రేమలో ఊరేగుతున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ నవ్వుల చలువ పందిళ్ల నీడన
నీ రెప్పల పచ్చటి పానుపుపై సేదతీరా..
నా, నీ అరచేతుల ఆలింగనం
మన జీవితాలకు రక్షాబంధం..

నా కళ్లు సిందూరాలై వర్షించినప్పుడు
నీ చేతుల్లో పూచే మల్లెల చల్లదనమే మందు..
నీ కలల ఊయలపై
నా మనసు పవళిస్తోంది...
పడిపోతాననే భయం లేదు
నీ అడుగుల కంచె ఉండగా..

ముద్దుల్ని మాలలు కట్టి ధరిస్తున్నా...
హద్దుల్లేని నీ ప్రేమశాలలో ఊరేగుతున్నా...
‘ముఖపుస్తకం’ కాదు..
నా మనసు పుస్తకం తెరిచి చూడు

నీ ప్రేమ ‘లాగిన్ ఐడీ’ ఐతే...
నీ చిలిపితనమే ‘పాస్‌వర్డ్..’
‘లాక్’ తీసి చూడు అందులో అన్నీ నీ పేజీలే..
చుక్కల్ని పట్టలేనేమో...
కాని, నీ మెరుపు కళ్ల ఊసుల్ని బంధించగలను..!

-అమూల్యచందు కప్పగంతు