AADIVAVRAM - Others

నిజానికి చావు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తి కోమాలో చిక్కుకుందని
జన మనోభావాలను చప్పరించి
ఆందోళన సుషుప్తి కప్పుకుంది
దీర్ఘరోగం గుప్పిట్లోంచి తప్పించేందుకు
పిడికెడు ఊపిరిలూదినా
పిసరంత ధైర్యం కొడగట్టిన ‘దీపజ్వాల’
స్వాతంత్య్ర సంగ్రామం
బాధలగాథల్ని జీర్ణించుకుంటూ
త్యాగాల బాటతో మమేకమై
ఊరూరా ప్రవహిస్తుండేది
అప్పుడప్పుడు, అక్కడక్కడా
ఆశాపాశము బంధనాలు భయం బాణాలొదిలినా
అంతరాత్మ ఆక్రోశాన్ని తాగేసి
ఉత్సాహములో మునిగితేలేది
పరాయి పాలన పాపాలను క్షమించి
పరుగుల బాట పట్టించగానే
స్వేచ్ఛా వాయువుల సంతరింపు
పరువు ప్రతిష్టల గాయాలు మాయం
మోసం, దగా, రోగాలు తిరిగి
మొలకెత్తి వృక్షాలై నమిలేస్తుంటే
మేకవనె్న పులుల మాయా మర్మాలు,
ప్రాణాలు అరచేతిలో పరుగులు
శ్రేయోభిలాషుల రక్తమెక్కించుకుని
బతికిబట్ట కట్టాలనే ఆరాటం

-ఐతా చంద్రయ్య