Others

బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. సులువేం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెటూళ్లో సాగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ -ఓ పిట్ట కథ. భవ్య క్రియేషన్స్‌పై వి ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తోన్న సినిమాతో నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా, చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశ్వంత్ దుద్దుంపూడి మరో హీరో. నిత్యాశెట్టి హీరోయిన్. మార్చి 6న సినిమా విడుదలవుతోన్న సందర్భంలో హీరో సంజయ్‌రావు మీడియాతో ముచ్చటించాడు.
* సెకెండ్ క్లాస్ టైంలోనే నాన్న తీసుకెళ్తే -లిటిల్ సోల్జర్స్ ఆడిషన్స్‌కి వెళ్లాను. ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మర్చంట్ నేవీ జాబ్ వదిలేసి -పూర్తిగా నటనలోకి వచ్చాను. చదువు తరువాత రియోడిజెనీరో, ఆమ్ స్టర్డామ్‌లో ఉద్యోగం చేస్తున్నా ఏదో అసంతృప్తి. అకౌంట్‌లో డబ్బుందని చెప్పుకోవడం తప్ప ఇంకేం ఉంటుంది. క్రియేటివ్ సైడ్ రావాలనే ఇలా వచ్చాను.
* కృష్ణవంశీ, రవితేజ.. ఇలా యాక్టింగ్‌వైపు రమ్మంటూ చాలామంది అడిగేవారు. ఎప్పుడైనా నిర్ణయం నీదేనంటూ నాన్న వదిలేశారు. క్రియేటివ్ సైడ్ వద్దామనిపిస్తోందని నాన్నకు చెప్పినపుడు నీ ఇష్టం అన్నారు. అందుకే ముంబయిలో -మనోజ్‌బాజ్‌పాయ్, ఆషిశ్‌గాంధీలాంటి ప్రముఖుల్ని ట్రైన్ చేసిన శిక్షకుడి వద్దే ట్రైనింగ్ తీసుకున్నా. ఏడాదిన్నర శిక్షణ తర్వాత, దేవదాస్ కనకాలవద్ద 6 నెలల కోర్స్ చేశా. తరువాత కృష్ణవంశీ వద్ద నక్షత్రం సినిమాకి చేరాను. 24 క్రాఫ్టులు నేర్చుకురమ్మని ప్రోత్సహించారు. బేస్‌లైన్ స్ట్రాంగ్‌గా ఉండాలన్నది ఆయన ఉద్దేశం.
* బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అన్నీ ఈజీ అనుకుంటాం. కానీ సాధ్యంకాదు. ప్లస్ 2నుంచే సాయితేజ్ పరిచయం. తనను చూశాకే అర్థమైంది, బ్యాగ్రౌండ్‌వున్నా ఎంత కష్టపడాలో. నాలుగేళ్లు సినిమా కోసం ఎదురు చూశా. బయటి వాళ్లని తెలీని కష్టమిది.
* క్రియేటివ్ ఫీల్డ్‌కి రావాలనుకున్న తరువాత అన్నింటినీ గమనిస్తూ వచ్చా. చాలా నేర్చుకున్నా. ఇక ఇండస్ట్రీలో నాన్న మార్గదర్శనం ఉంటుంది. తప్పా ఒప్పా కాదు, పడిలేస్తూ నేర్చుకో అంటారాయన.
* పూరివద్ద కోడైరెక్టర్‌గా పనిచేసిన కిషన్‌రెడ్డి వద్ద ఓ సినిమా చేశాను. మూడు వైవిధ్యమైన కథలతో తెరకెక్కుతున్న సినిమా అది. త్వరలో రిలీజ్‌కి రానుంది. అంతకంటే ముందే ఓ పిట్టకథ రిలీజవుతోంది.
* దర్శకుడు చందుతో మూడేళ్ల ప్రయాణం సాగించాను. దాంతో కంఫర్ట్ లెవల్ ఉంది. ఇతర నటీనటులతోనూ ట్రావెలయ్యాను. కాబట్టి సౌకర్యంగానే సాగింది. చిన్న చిన్న సమస్యలున్నా దర్శకుడు కరెక్ట్ చేశాడు. కెమెరాని ప్రేమించి నటిస్తాను.
* పాత్రకోసం సిటీలో సింగిల్ స్క్రీన్స్‌కి వెళ్లి అక్కడి పనివారిని చూశాను. పదిమందినీ పరిశీలించి నేర్చుకో. ఏది నచ్చితే అదే క్యారెక్టర్‌కి ఆపాదించుకో అదే ఫాలో అవ్వు అని చందు చెప్పారు.
* డాడీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నెర్వస్ లేదు కానీ... ఆయన నా నటన గురించి ఏమనుకుంటారో అనిపించేది. అమ్మ నాన్న నా వైఫ్ అందరూ నటనలో ఇంప్రొవైజేషన్ చెప్పేవారు. ఆ ముగ్గురూ ఒకరికొకరు ఫిల్టర్ చేశాక ఫైనల్‌గా నాకు నేనుగా మెరుగుపడటం ఎలాగో నేర్చుకున్నా.
* ఫస్ట్ కాపీ చూశాను. 70ఎంఎం స్క్రీన్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నానా అనిపించింది. నేను నటుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా కలలాగే ఉంది.
*