Others

క్రౌండ్ ఫండింగ్‌తో మిస్టర్ అండ్ మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్‌ని ఎట్రాక్ట్ చేయడానికి సహజత్వంతో వస్తోన్న చిత్రం -మిస్టర్ అండ్ మిస్. డేటింగ్‌లు, వీడియో చాటింగ్‌లు ప్రేమలో భాగమైన ఈ జనరేషన్ ప్రేమకథగా రూపొందింది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ -మిస్టర్ అండ్ మిస్ యూనిట్‌కు విషెస్. నేను సినిమాను పెద్దది, చిన్నదిగా చూడను. మంచిదా, కాదా అనే చూస్తా. సినిమా ట్రైలర్ బాగుంది. సినిమాను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారనే నమ్ముతున్నా. సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్, మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్‌కు మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నా అన్నారు. హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ -ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్‌గా ఉంది. సినిమాలోని పాయింట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. డైరెక్టర్ అశోక్ సినిమాను బాగాతీశారు. మార్చి ఎండింగ్‌లో వస్తోన్న సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో శైలేష్ సన్నీ మాట్లాడుతూ -మా సినిమాకు క్రౌడ్ సపోర్ట్ ఉంది. రేపు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నా. మా టీం చేసిన మ్యాజిక్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నా అన్నారు. డైరెక్టర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ -మిస్టర్ అండ్ మిస్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రౌడ్ ఫండింగ్‌తో సినిమా చేశాం. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా కథ అల్లుకున్నా. మార్చి చివర్లో థియేటర్లకు వస్తున్నాం. ఎంజాయ్ చేయండి అన్నారు.