Others

ఆడపెత్తనం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగమ్మకున్న ఆస్తి -మెతక మొగుడు, సవతికొడుకు, సొంత కూతురు. పట్నంలో చదువుకుంటూ కృష్ణ -అంజలీదేవి లాంటి రాధను ప్రేమిస్తాడు. రాధ పేదది కావడంవల్ల.. రంగమ్మ అడిగిన కట్నం ఇవ్వలేకపోతుంది. రాధ తండ్రి -రామయ్య అనే ఆయన దగ్గర అప్పుచేస్తాడు. కానీ ఇచ్చిన డబ్బును రామయ్య కాజేస్తాడు. దాంతో కృష్ణ తెగించి రాధను పెళ్లి చేసుకొని వేరు వెళ్తాడు. ఇంతలో రేలంగి.. రంగమ్మ ఇంట్లో అద్దెకొచ్చి ఆమె కూతుర్ని బుట్టలో పడేసి పెళ్లాడేస్తాడు. అల్లుడి చేతిలో మోసపోతూ వుంటుంది రంగమ్మ. ఆస్తినంతా ఒక నాట్యగత్తెకు బదలాయిస్తుంటాడు అల్లుడు. రంగమ్మ భర్త చనిపోవడం, కృష్ణ రైతులతో కలిసి సహకార బ్యాంకు పెడతాడు. మోతుబరి రామయ్య, రంగమ్మ అల్లుడు కలిసి అఘాయిత్యాలు చేస్తుంటారు. చివరికి కృష్ణ -రంగమ్మ ఆస్తి వ్యవహారాల్లో కలుగజేసుకోవడం, రంగమ్మ, ఆమె అల్లుడు తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడటంతో కథ సుఖాంతమవుతుంది. నాగేశ్వరరావు, అంజలి, గుమ్మడిలకు గొప్ప పాత్రలేమీ దొరకలేదు. రేలంగి దుష్టులైన అల్లుడు పాత్ర కొత్తగా వుంటుంది. చెప్పుకోదగినవారు రంగమ్మగా నటించిన కన్నాంబ, భర్తగా చదలవాడ కుటుంబరావు. రాజేశ్వరరావు వేణువుల సంగీతంతో పాటలు హాయిగా వుంటాయి. గొప్ప గొప్ప అనిపించవు కానీ పాడిన సుశీల, ఘంటశాల శ్రావ్యత చెవులకు ఇంపుగా వుంటుంది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. కథ పేలవంగావున్నా, సమర్థుడైన దర్శకుడి చేతిలో పడితే గొప్పగా తయారవుతుంది చిత్రం అనడానికి ఆడపెత్తనం ఉదాహరణ. మొత్తంమీద మంచి కాలక్షేపం కోసం చూసే సినిమా. చూసిన నాకు నచ్చిన సినిమా. 1958లో ప్రభ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటి యువతరానికి కనువిప్పులాంటిది.
-చంద్రశేఖర్, వక్కలంక