Others

కవి దృష్టిలో విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- జాతీయ విజ్ఞాన దినోత్సవం - నార్ల వేంకటేశ్వరరావు
*
ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీకు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? అది లీఫు సంవత్సరం కాకపోతే ప్రపంచానికంతటికీ నెలలో చివరి రోజు. కాని భారతదేశంలో మాత్రం కాదు. భారతదేశంలో ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ విజ్ఞాన దిన్సోవం (నేషనల్ సైన్స్ డే) అంటే ఈ రోజు ఎవరైనా శాస్తవ్రేత్త పుట్టిన రోజా? కాదు. మరి ఈ రోజునే ఎంచుకున్నారు? భారతదేశంపు భౌతిక శాస్తవ్రేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి.రామన్ తన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘రామన్ ఎఫెక్ట్’ పరిశోధనను ధృవీకరించుకున్న రోజు. పాఠశాలకు వెళ్ళే చిన్నారులనుండి విజ్ఞానశాస్త్రంలో కృషిచేసే శాస్తవ్రేత్తల వరకు అందరికీ పండుగ రోజు.
చదువుకున్న వారిలో గమనిస్తే- కేవలం ఉద్యోగం కోసం చదివేవారు, చదివినదాన్ని విశే్లషించేవారు, నేర్చుకున్న విషయం ఆధారంగా సమాజాన్ని విశే్లషించేవారు, తాము నేర్చుకున్న విషయాన్ని సమాజానికి అన్వయించేవారు, రాబోయే కాలంలో సమాజం ఎలా ఉండాలి అని ఆలోచించేవారుగా రకరకాలుగా కన్పిస్తారు. ఈ ఆఖరి వర్గానికి చెందినవారు వేదాంతులు, కవులు. వేదాంతం కంటే కవిత్వం త్వరగా బలంగా ప్రజలలోకి వెళుతుంది. ప్రజల నోళ్ళలో నానుతుంది. సరైన కవిత్వం సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. అందుకే ‘రవి కాంచనిచో కవి గాంచునే కదా’ అన్నాడో ప్రాచీన కవి.
భారతదేశంలో విజ్ఞాన రంగం ఎలా ఉండాలి? దీనిపై మేధావులు రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఒక కవి అంతరంగం ఏమంటుంది? తెలుగు ప్రజలు, మేధావులు మెచ్చిన సంపాదకుడు, రచయిత, కవి, నాటకకర్త శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు. విజ్ఞానశాస్త్రం గురించి తమ అభిప్రాయాలను, వారి దార్శనికతను ‘నవయుగాల బాట నార్ల మాట’ అంటూ పద్యాల రూపంలో వివరించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఈ ఆధునిక కవి అభిప్రాయాలను విశే్లషిద్దాం.
విజ్ఞానశాస్త్రం ఏం చేయగలదో వివరిస్తూ- జ్ఞానమిచ్చు సైన్సు, శక్తినిచ్చు / భాగ్యరాసులిచ్చు, భవితవ్యమిచ్చురా అంటారు.
అదే సమయంలో మతము ముక్తి పేర మోసం చేస్తుందంటూ హెచ్చరిస్తారు. సైన్సు అన్ని జగాలకు మానవుని అధిపతిని చేసిందంటారు నార్ల. ఈ అధికారం కోసం సత్యాన్ని శోధించేదే విజ్ఞానమంటారు.
సత్యశోధ చేసి, జ్ఞాన పరిధి పెంచి / పరిసరాలపైన ప్రభుత గూర్చి / సైన్సు నరుని సకల జగదీశు చేయురా! మానవునికి సరైన దృక్కోణం, ఆలోచనా శక్తి, సత్యాన్ని శోధించే అవకాశాలను విజ్ఞానశాస్త్రం ఇస్తుందంటారు. ఈ పద్యం చూడండి.
సైన్సు విడువ, నీకు జ్ఞానయోగము లేదు;
సైన్సు విడువ, లేదు సత్యపథము;
ఛాందసమ్మె మిగులు సైన్సును విడువగా
మరి ఈ విజ్ఞానం ఎక్కడుంది. దీని కోసం ఎక్కడ వెతకాలి. దీని సమాధానంగా సైన్సు విశ్వవ్యాపకత్వాన్ని వివరిస్తారు. శాస్ర్తియ విజ్ఞానం మనం చేసే ప్రతి పనిలోనూ అజ్ఞాతంగా ఉంటుంది. కాని దాన్ని చూసే తార్కిక దృష్టి మనం అలవరచుకోవాలి. మానవునిలోని ఆలోచన పెరగటం, సమాజంలో సభ్యత రావటానికి కారణం విజ్ఞానమే. ప్రతి విషయాన్ని మూలాలలోకి వెళ్లి శాస్త్ర దృష్టితో పరిశీలించాలంటారు నార్ల.
కుమ్మరి పనిలోన, కమ్మరి పనిలోన / ఎంచి చూడ సైన్సు ఎంత లేదు? / సైన్సుతోనె నరుని సభ్యత పెరిగెరా!
ప్రాచీన కాలంలో జ్ఞానం అంటే ప్రధానంగా వేదాలు, ఉపనిషత్తల వంటివి. అవి ప్రధానంగా మంత్రాలు కలిగి ఉంటాయి. ఆధునిక కాలంలో నూతన విజ్ఞాన శాస్త్రంలో కొత్త యంత్రాలు రావలసిన అవసరం ఉందంటారు నార్ల. వాటిని రోజూ వెల్ల వేయాలంటారు. ఈ కింది పద్యం పరిశీలించండి.
ఏపు నందగోర ‘హెచ్.టు.ఓ’లను బోలు
మంత్ర పఠన నేడు మనకు వలయు,
మారవలెను సతము మంత్రశాస్తమ్రులైన
విజ్ఞానశాస్త్రం ఎన్నో ఆవిష్కరణలను చేసింది. అయితే దీనిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత నాయకులది, జన బాహుళ్యానిది. ఉదాహరణకు కత్తితో కూరగాయలు తరగవచ్చు, ఎదుటివాడి ప్రాణం తీయవచ్చు, శస్తచ్రికిత్స చేయవచ్చు. అలాగే విజ్ఞానశాస్త్భ్రావృద్ధి విషయంలో పరిశోధనలు ప్రపంచ శాంతి కోసమే జరుగుతాయి. కాని రాజకీయ నాయకులు వాటిని పెడదారి పట్టిస్తున్నారంటారు కవి.
ప్రకృతినే జయించి, పరమాణువును చీల్చి/ శాస్తవ్రేత్త మార్చి పలక సిరులు/ రాజకీయవేత్త రణమును కూల్చెరా/ ఈరోజు సైన్సు పరిశోధనల ఫలాలు పక్కదారి పడుతున్నాయి. ఇతరుల అభివృద్ధికి ఉపయోగపడవలసినవి పీడనకు ఉపయోగిస్తున్నారు. సైన్సు ఉపయోగాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని, దాని వేగాన్ని అందుకోలేకపోతున్నారని వ్యధిత హృదయంతో చెప్పిన పద్యం.
పరుగులెత్తుచుండ/పరువులెత్త సైన్సు మెరుపు వేగముతోడ / నరుడు నడుచుచుండె నత్త నడక/ ఎట్టులుండు శాంతి ఈనాటి సంఘాన?
విజ్ఞాన శాస్త్రం ఒక దారిలో పయనిస్తే దానిని వినయోగించుకొనవలసిన ప్రజలు వేరొక దారిలో ప్రయాణిస్తున్నారు. ఉదాహరణకు 1950, 60 ప్రాంతాలలో ఇమ్యూనైజేషన్ కొరకు ఆరోగ్య శాఖ సిబ్బంది వస్తే పిల్లలను దాచేవారు, లేదా ఇంజెక్షన్ ఇచ్చిన చోట పేడ రాసేవారు. ఇంకొన్నిచోట్ల ఆరోగ్య శాఖ సిబ్బందిని ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. బహుశః ఇటువంటి వాటిని గమనించి చెప్పిన పద్యం.
సైన్సుదొకదారి, సంఘానిదొక్కటి
భావము దొకదారి, బ్రతుకుదొకటి
పెక్కుదార్ల నడ ఇక్కట్లు తెచ్చురా
శాస్తవ్రేత్తలు అన్ని సిరులు చేకూరిస్తే రాజకీయవేత్తలు యుద్ధాన్ని తెచ్చారంటారు. ఇది జపానుపై అమెరికా వేసిన అణుబాంబును గుర్తుకుతెస్తుంది.
ప్రకృతినే జయించి పరమాణువును చీల్చి
శాస్తవ్రేత్త కూర్చె సకల సిరులు
రాజకీయ వేత్త రణము కూర్చెరా
స్థూల దృష్టితో చూస్తే ఇవన్నీ ఆయన సైన్సు - సమాజం దృష్టితో చెప్పిన పద్యాలు. సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే విజ్ఞానశాస్త్ర అవసరం, సమాజానికి దాని ఆవశ్యకత, శాస్త్ర పరిశోధనల ద్వారా మానవజాతి సర్వతోముఖాభివృద్ధిని ఎలా సాధించాలి? మానవజాతి కళ్యాణానికి విజ్ఞానశాస్త్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న ఆర్తి కనపడుతుంది.
సైన్సుడే సందర్భంగా సర్ సి.వి.రామన్‌తోపాటుగా సైన్సుపై పద్యాలు రాసి సమాజానికి దిశా నిర్దేశనం చేసిన వేగుచుక్కల ప్రతినిధిగా శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారిని తలచుకోవటం తెలుగువారందరి కర్తవ్యం.

-వింజనంపాటి రాఘవరావు 9247444994