Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దాచిపెట్టిన ధనమును దానధర్మ
కార్యములకింతఁ జేయరే ఖర్చు తాముఁ
దినరు పెట్టరు రవ్వంత దేని కొఱకు?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దాచిపెట్టిన ధనాన్ని దానధర్మాలకు ఖర్చుపెట్టరు. ఇంతేకాదు తాము తినరు సరికదా ఇతరులకు కూడా రవ్వంతైనా పెట్టరు. కేవలం కూడబెట్టటటమే చేస్తుంటారు. ఇలా చేయడం అనేది వారిలో ఉన్న అజ్ఞానానికి పరాకాష్ఠ అని తెలుసుకోలేరు కనుక ఓ కర్మసాక్షివైన ఓప్రభాకరా వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించవయ్య స్వామీ!
తే.గీ. దేహీ!యనిఁ జేయి చాచిన దీనజనులఁ
గన్నులుండియుఁ జూడకఁ గరగిపోకఁ
బైసరాల్చిన ఁ బ్రాణమ్ము పైకిపోవు
నటుల భావింప నరకమ్ము నడచివచ్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దేహీ! అని చేయిచాచి అర్థించిన దీనులను కన్నులుండి కూడా చూడకుండా, అట్టివారి దీనత్వానికి జాలి పడకుండా పైసలిదిలిస్తే ప్రాణం పోతుందనే లోభుల చెంతను నరకమే నడచి వస్తుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262