Others

స్మరిస్తే చాలు సత్యసంపన్నుని సాక్షాత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన ధర్మం మిక్కిలి నిగూఢమైనది. ఆ పరమాత్మ మినహా ఆ రహస్యాన్ని మానవ సమాజానికి చేర్చగల వారు మరొకరులేరు. ఆయన అనుగ్రహం వల్ల విశుద్ధ భక్తి ముక్తులు అయిన పనె్నండు మహాజనులకే ఆ పరమ రహస్యం అవగతం అయింది. బ్రహ్మ, నారద, శివ, నలుగురు కుమారులు సనకసనాదులు, కపిల మహర్షి, మను, ప్రహ్లాద, జనక , భీష్మ బలి, శుకదేవ, యమ సనాతన ధర్మాన్ని గురించిన అవగాహన మన్నది జైమిని ముని ఆయన అనుయాయులు త్రరుూ సతి అయిన రుక్, యజుర్, సామవేదాలకే పరిమితమయ్యారు. వేదవేద్యుడయిన పరమాత్మ సంకీర్తన కన్నా వారికి వైదిక కర్మాచరణమే ప్రధాన. అక్షరంపొల్లు పోకుండా మంత్రాలను ఉచ్చరించటమే వారికి కావాలి. భాగవత ధర్మంలో పొరపాటున దివ్యనామాన్ని తప్పుగా పలికినా, ఆ దోషం క్షంతవ్యం. అజామీళుడు కేవలం ప్రాణభీతితో తన కొడుకు పేరు తలచాడు. నారాయణ నామస్మరణం విన్న నలుగురు విష్ణుదూతలు అతడిని వైకుంఠానికి తీసుకొని వెళ్లటానికి దిగి వచ్చారు.
స్వామి వారి ఆయుధాలు సుదర్శన, కౌమోదకీలు భక్తులను సదా కాపాడటానికి సిద్ధంగాంటాయి అంటారు. యమధర్మరాజు తన కింకరులతో పాపాత్ములైన అజామీళుడిని పట్టుకోలేక తిరోగమించినందుకు వారు కించపడ్డారు. యముడు, భాగవత ధర్మాన్ని వారికి బోధించి చింతను పోగొట్టాడు అని శుకుడు పరీక్షితుడికి తెలియచేశాడు.
ఏమిటి భాగవత ధర్మం? అన్నీ ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శఱణు కోరితే, అన్నీ పాపాలు తొలగించివారికి మోక్షం ప్రసాదిస్తాను. అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడు. భాగవత ధర్మ సార సంగ్రహమే ఆళ్లోక సారాంశం. సనాతన ధర్మం నాలుగు సంప్రదాయాల సమాహారం. వాటిని బ్రహ్మ సంప్రదాయం, శివ, లక్ష్మీ, కుమార సంప్రదాయాలు అంటారు. బ్రహ్మ,రుద్ర శ్రీ, కుమార సంప్రదాయాలని కూడా చెబుతారు. ఇవికాక తదితరమైన సంప్రదాయాలెన్నో ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల కాలయాపన తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. అలాంటి అసంబద్ధ సంప్రదాయాలు శాస్త్ర విరుద్ధం. సంప్రదాయం కొరవలడిన మంత్రోపదేశాలు నిరర్థకం. దైవ సంకీర్తనతో మొదలయ్యే భక్తి యుక్తమైన భజన, జ్ఞాన వైరాగ్యాలకన్నా మిన్న . అదేదైవ సాక్షాత్కారానికి రాజమార్గం. భక్త సులభుడైన భగవంతుడు ఏ మంత్రాలు, స్తుతులు, స్తోత్రపాఠాలు చేయకపోయినా నిర్మల మనస్సుతో పరమాత్మ తప్ప అన్యమైనదీ ఏదీ లేదని అనుకొన్న వారికి అవ్యక్తుడైన భగవంతుడే వ్యక్తమై వారు కోరిన రూపంలో ప్రత్యక్షమవుతాడు. భాగవతులకు పునర్జన్మ అంటూ ఉండదు అని హామీ ఇచ్చారు. పునర్జన్మ నితి నన్ను పొందాక, భాగవతులకు, భక్త యోగులకు పునః సంసార బంధం కలుగదు అని తాత్పర్యం.
కలియుగంలో భక్తిని మించిన యుక్తి కనిప ఇంచదు. అతి తప్ప మరో మార్గం లేదంటారు చైతన్య ప్రభువు. భగవన్నామ సంకీర్తన ఒక్కటి చాలు భక్తుల మనస్సును పరిశుభ్రంగా ఉంచడానికి అర్చన తోడయితే కైవల్య ప్రాప్తి మరింత వేగవంతం అవుతుంది. మానవ సమాజం భక్తి మార్గంలో పయినంచటానికి వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడుతాయి. అవి కైవల్యానికి దారిదీపాలు. కైవల్య పదమేతమ జీవిత పరమార్థం అని చాలామంది అంటారు. అందుకే అజ్ఞానపు చీకట్లో కొట్టు మిట్టాడుతుంటారు. అలాంటి వారు కనీసం విష్ణు నామ స్మరణ కూడా చేయలేని అవైష్ణవులు వారిని అకృత విషుణ కృత్యాన్ తప్పకుండా ఇక్కడికి తీసుకు రమ్మని యమధర్మరాజు ఆదేశించాడు కింకరులను. భాగవత ధర్మం, విష్ణు దూతల మాహాత్మ్యం. తెలియక అజామీళుడిని బంధించటానికి వెళ్లిన యమకింకరుల పక్షాన సాక్షాత్తు యమధర్మరాజే మహావిష్ణువును క్షమించమని ప్రార్థించాడు. అంటూ శుకయోగి పరీక్షిత్తునకు భక్తి విలువను బోధించాడు. యముడి ఆజ్ఞను సహితం త్రోసిరాజన్న విష్ణు నామసంకీర్తన ప్రభావం తెలుసుకున్న కురురాజు ఉల్లం భక్తి రస ప్ల్లావితం అయ్యి పల్లవించింది.

- నిరామయ