Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. విద్యయుం గల్గ విశ్వాస వెలుగవచ్చు
నదియు లేకున్న ఁ జీకట్ల నంతముగను
వచ్చియుంజుట్టి వేయంగ వణుకుఁ బుట్టుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: బాగా చదువుకుంటే విశ్వంలో ఎక్కడైనా ఎంతగానో ప్రకాశించవచ్చు. ఆ విద్యలేనట్టయితే చీకట్లనంతంగా వచ్చి చుట్టి ముట్టేస్తాయి. అప్పుడు భయంతో వణికిపోవలసి వస్తుందని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామి.

తే.గీ. బ్రతుకు భారంబుఁ గాకుండ బహువిధాల
జాగరూకత వహియింపఁ జక్కనైన
జీవితమ్మది దొరకు నచ్చెరువు లేదు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: బ్రతుకు భారం కాకుండా ఎన్నో విధాలుగా జాగ్రత్త వహించాలి. అప్పుడే చక్కని జీవితం లభిస్తుందనడంలో ఆశ్చర్యం లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోదించుము స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262