AADIVAVRAM - Others

సువ్వి సువ్వి సువ్వి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యం.వి. రమణకుమారి రాగరాగిణి అనే సంస్థను స్థాపించింది. అన్నమాచార్య పాటలు, సినీ సంగీత విభావరులు అంటే ఆమెకు ప్రాణం. ఒకనాడు హైదరాబాద్‌లో ఆర్థ్రంగా అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నది.
‘సువ్వి సువ్వి సువ్వి
నవ్వుచు దేవకి నందనుకనియె’
ఇది అన్నమాచార్య కీర్తన.
ముఖ్య అతిథిగా సి.నారాయణరెడ్డిని పిలిచింది. ఆయన ఎదురుగా కూర్చున్నాడు. రమణకుమారి పాట ఆయనకు నచ్చలేదు.
‘ఆ సువ్వి కాదే - రమణా - నా సువ్వి పాడు’ అని ఆజ్ఞాపించాడు.
ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సింగిరెడ్డి గారి సువ్విని మొదలుపెట్టింది.
‘‘సువ్వి సువ్వి సువ్వాలమ్మా - నవ్వాలమ్మా’’
ఇది స్వాతిముత్యం అనే సినిమాలో సినారె రాసిన పాట.
అన్నమయ్య పదములను దేశికవితాగానం అంటారు. అందులో నేటికి ఐదు వందల సంవత్సరాల నాటి తెలుగు మాండలిక సుడిగారం పుష్కలంగా ఉంది. మరి ఈ సినిమా పాటల్లో ఏముంది?
‘‘అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే’’ ఇది ఎవడో పేకాటలో ఓడిపోయిన వాడు పాడిన పాట.
‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీచాన - బుగ్గల మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో తెలుపగలవా?’’ ఈ పాట రాసింది ఆత్రేయ, పాడింది ఘంటసాల. చిత్రీకరింపబడింది అక్కినేని మీద.
ఈ ముగ్గురూ విలాస జీవితాలు గడిపిన వారే. ఎవ్వరూ సుత్తె పట్టలేదు, నాట్లు నాటలేదు, కొడవలితో కోతలు కోయలేదు. మరి ఈ శ్రామిక గీతం రాయటం, పాడటం, నటించడం వాటిని సంగీత విభావరుల పేరుతో ఊదరగొట్టడం.
‘హుషారుకొలిపేవెందుకో నిషాకనులదానా’’ అంటూ యువతను రెచ్చగొడుతూ ఉంటారు.
చైనాలో ఇట్లా జరుగుతుందా? రష్యాలో, క్యూబాలో? జరుగదు.
కానీ ఇండియాలో మేము సామ్యవాదులం అని చెప్పుకొనే వారంతా మంది నెత్తిన తైలమర్దనం చేసి తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.
కూరలో కరివేపాకుల్లా దీపశిఖలోకి దూకిన శలభాల్లా ఈ అమాయక ప్రేక్షక దేవుళ్లు సినీవ్యామోహంలో బతుకులు పాడుచేసుకుంటున్నారు.
కన్నడ కంఠీరవులూ, తెలుగు నటసార్వభౌములూ, బిగ్‌బి, షాట్‌గన్‌లు ఎవరైనా తమ బిడ్డలను సైన్యంలో చేర్పించారా?
ఈ సువ్వి సువ్వి సువ్వాలలు ఆల్‌ఖైదా దుర్మార్గాలపై ఓ పాట రాశారా?
రాయరు. ఎందుకంటే దేశభక్తి వారి ప్రవృత్తి కాదు. మందు కోసం, మందికి కుచ్చుటోపీలు పెట్టడం వారి వృత్తి, ప్రవృత్తి.
హిపోక్రసీ కాదా?
జనవంచన కాదా?
సువ్వి సువ్వి పాటకు, నటనకు అందించిన వాడు కమలహసన్. అతని సినిమాను చూసి కనకవర్షం కురిపించిన వారు భారతీయులు.
‘‘్భరతీయత నశించాలి. భారతీయులు తాలిబన్ల వంటి టెర్రరిస్టులు’ అంటూ కమలహసన్ నిన్న ఒక ప్రకటన చేశాడు.
ఆయన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కానీ మద్యం, మాంసం, ఇతర గ్రంధసాగత్యం అన్ని సుగుణాలూ పుష్కలంగా ఉన్నాయి. మరి ఇతడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు?
ఈ సినీ రచయితలు, నటులు, నిర్మాతలు, కవులు, సమాజం కోసం జీవించడం లేదు. లోకం నెత్తిన చిప్ప పెట్టి జేబులు నింపుకుంటున్నారు. ఆ డబ్బుతో ప్రపంచయాత్రలు చేస్తూ జల్సా జీవితం గడుపుతారు.
‘‘జోరుగా హుషారుగా షికారు’’ చేస్తారు. ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
కంటిచూపుతో కాల్చేస్తా - మొలతాడుతో ఉరేస్తా - ధనవంతల పేగులు తీసి మెడలో వేసుకుంటా -
డైలాగులు బాగానే ఉన్నాయి. మరి మీ ఫాంహవుస్‌ల మాటేమిటి? మీ వ్యసనపరాయణత్వం సంగతేమిటి?
నీతులు ఆముదము వంటివి ఇచ్చు వారికి సులభము - పుచ్చుకొనువారికి కష్టము
సినిమాల్లో ఎందుకు చేరావు? అని ప్రశ్నిస్తే సాధ్యం కాదు అని తెలిసి రాజకీయాల్లో చేరాను అంటున్నారు.
వీళ్లకు భారతరత్నాలు, పద్మవిభూషణాలు ఎందుకు? ఎవరిని ఉద్ధరించారని?
వీళ్ల దురహంకారాలు, ధనదాహాలకు భారత జాతి బలి అయిపోతున్నది
‘మా పాటలు మా ఇష్టం - అడిగేందుకు నువ్వెవడివి?’’ అంటున్నారు.
మంచిది, మీ పాటలు మీ బాత్‌రూముల్లో పాడుకోండి. మైకంలో మైకుల్లో అరుస్తూ మా చెవులను బలిపెట్టకండి. మీకీ సంగతి తెలుసా?
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ప్రముఖులు నైజీరియన్ డ్రగ్స్ సేవిస్తూ, అమ్ముతూ పట్టుబడ్డారు. బాలీవుడ్ ప్రముఖులు అండర్ గ్రౌండ్ డాన్స్‌తోనూ, ఉగ్రవాదులైన దావూద్ ఇబ్రహీం వంటి వారితో చేతులు కలిపి, ఫిలిం ఇండస్ట్రీని షెల్ కంపెనీగా వాడుకుంటున్నారు.
పూర్తి వివరాలకు అకున్ సబర్వాల్ వంటి పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఉన్న రిపోర్టులు చూడండి.
సారాంశం. భారతీయ కళా సాంస్కృతిక, సాహిత్య రంగాలను స్వార్థపరులు, విదేశీ శక్తులు కలిసి భ్రష్టు పట్టించారు.
కనీసం మీరు చెప్పింది మీరైనా ఆచరించకపోతే ఎలా?
లేలే రష్యా అంటూ విదేశీ స్తుతిగానం చేసినవాళ్లు ‘హసనానికి రాణివి నీవై, వ్యసనానికి బానిస నేనై’ బ్రతకటం సమర్థనీయమేనా?
ఔను! నిజం ప్రణయరథం సాగేనె నేడు ఈ డబ్బింగు ఎంగిలిపాట ఏ సినిమాలోనిదో గుర్తుకు రావడం లేదు. కానీ రాసినవాడు మాత్రం మహా ఘనత వహించిన విప్లవ కవి.
ఈ పురుచ్చితలైవి ఎవరు?
(విప్లవ వనిత అని ఆ తమిళ పదానికి అర్థం)
ఈమె సెల్లార్ల నిండా బంగారం దిమ్మెలు, వజ్రాల బస్తాలు దొరికాయి.
‘‘రాజువయ్యా.. మహారాజువయ్యా’’ ఈ మహారాజు ఎవరు? ఈ సంగీత విభావరి ఏమిటి? ఆ నటీనటుల కుటుంబ సభ్యులకు లేని కండూతి మీకెందుకు?

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్