Others

22 ఇంట్రోగా.. మార్ మార్ కే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా జోడీగా మా ఆయి ప్రొడక్షన్స్‌పై దర్శకుడు శివకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -22. సుశీలాదేవి నిర్మించిన చిత్రం నుంచి తొలి సింగిల్ ‘మార్ మార్ కే’ను హీరో ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గీత రచయిత కాసర్ల శ్యామ్ -వైవిధ్యమైన పాట రాసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హీరో రూపేష్‌కుమార్ మాట్లాడుతూ -నేను చేస్తున్న సినిమా తొలి పాటను పాన్ ఇండియా హీరో ప్రభాస్ విడుదల చేయడం కిక్‌నిచ్చేదే. సినిమాలో అద్భుతమైన బీజీఎం ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది అన్నారు. దర్శకుడు శివకుమార్ బి మాట్లాడుతూ -22022020న తొలి సాంగ్ ఆడియన్స్‌కి అందిస్తున్నా. చిత్రం కానె్సప్ట్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రభాస్‌లాంటి హీరో -మంచి డెప్త్‌వున్న కానె్సప్ట్ అంటూ ప్రోత్సహించటం కొండంత బలం. తెలుగు పాటలో హిందీ లిరిక్స్ జత చేయడంతో మంచి ఊపు వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది అన్నారు. శివకుమార్ తండ్రి, నిర్మాత బిఏ రాజు మాట్లాడుతూ -రూపేష్ పోలీసు యూనిఫాంలో బావున్నాడంటూ ప్రభాస్ మెచ్చుకోవడం ఫస్ట్ సక్సెస్. ఈ పాట అందించిన రచయితను -దివంగత దర్శకురాలు, నా భార్య జయ ఇండస్ట్రీకి పరిచయం చేయడం, ఆయన గొప్పస్థాయికి ఎదగడం ఆనందించే విషయమన్నారు. కార్యక్రమంలో సింగిర్లు మేడీ, పెద్దిరాజు మాట్లాడారు.