Others

దేనికైనా.. టైంరావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంగీత దర్శకుడి వద్దా ఏదోక సినిమా దొరుకుతూనే ఉంటుంది. ఏదోక సినిమాతో మంచి పేరు రావడమూ జరుగుతుంటుంది. కానీ -ఒక్కొక్కరికి ఒక్కోసారి అద్భుతమైన విజయం దక్కుతుంది. ఆ అద్భుతం దక్కాలంటే -కానె్సప్ట్ బావుండాలి. హిట్ రేంజ్‌కి తీసుకెళ్లే హీరోపడాలి. సంగీత దర్శకుడికి అలాంటి అద్భుతం దక్కడానికి ఓ టైముంటుంది. అది వచ్చేవరకూ వెయిట్ చేయడమే -అంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్. ప్రస్తుతం ‘22’ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సాయికార్తీక్ -శనివారం పుట్టినరోజు సందర్భంగా మీడియాతో కాసేపు ముచ్చటించాడు.
* ప్రస్తుతం నేను చేస్తున్న థ్రిల్లర్ యాక్షన్ 22కు -బీజీఎం అతి ముఖ్యమైంది. డిఫరెంట్ క్రైమ్ కంటెంట్‌తో వస్తున్న ప్రాజెక్టులో దర్శకుడు శివ -మూడు పాటల్ని డిజైన్ చేశాడు. మార్ మార్ కే -సాంగ్ ఇప్పటికే విడుదల చేశాం. మదర్ సెంటిమెంట్‌తో సాగే పాట ఔట్‌స్టాండింగ్ అని నమ్ముతున్నా.
* దాదాపు 75 సినిమాలకు సంగీతం సమకూర్చాను. ఈ బర్త్‌డేతో 37వ పడిలోకి వస్తున్నా. లవర్ చిత్రంలో పాట నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పటికి దాదాపు 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇంకా మంచి పాటలందించాలన్న నిశ్చయంతోవున్నా.
* తొమ్మిదవ ఏటనుండే రిథిమ్ ప్లేయర్‌ని. పరిశ్రమలో పదేళ్ల కెరీర్ పూరె్తైంది. నాకు తెలిసింది మ్యూజిక్కే. అదే చేయాలి. ఇక్కడ టైమ్, అదృష్టం ముఖ్యం. అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చేవరకూ ఎదురు చూడాలి.
* హిట్ కొడితేనే అవకాశాలు అంటారు. నా విషయంలో అలా లేదు. హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా పదేళ్లుగా కెరీర్ నడుస్తోంది. నావరకూ బెస్ట్ వర్క్ ఇస్తూనే ఉన్నా. మ్యూజిక్‌వల్ల సినిమా పోయిందన్న మాట పడలేదు ఇప్పటి వరకూ. 2014 నుంచి 16 వరకూ మూడేళ్లలో 36 సినిమాలు చేసే అవకాశం దొరికింది నాకు. అదే టైమ్ అంటాను.
* టెక్నాలజీ అప్‌డేట్ అవుతూనే ఉంది. ఎన్నో మార్పులు చూస్తున్నాం. గతంలో ఏదైనా ఒక మార్పు చోటు చేసుకోవాలంటే ఐదేళ్లు పట్టేది. ఇపుడు రెండు, మూడు నెలలు చాలు.
* మెలోడీపై నాకు మంచి పట్టుందన్న నమ్మకముంది. కాకపోతే అలాంటి పాటలు చేసే అవకాశాలు రావడం లేదు. 22లో మదర్ సెంటిమెంట్ సాంగ్ చేశా. ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ అది. ఇకపై అలాంటి మెలోడీస్ చేసే అవకాశం వస్తుందేమో చూడాలి.
* మణిశర్మ వద్ద నేను, తమన్, వాళ్లబ్బాయి సాగర్ ముగ్గురం జర్నీ చేశాం. మంచి పాటలు చేసినపుడు ఒకరికొకరు వినిపించుకుని చర్చిస్తాం. అందరం క్లోజ్‌గానే వుంటాం.
* ప్రస్తుతం ఏకే ఏంటర్‌టైన్‌మెంట్స్‌తో బంగారు బుల్లోడు, నరేష్ ప్రాజెక్టు, కొత్త హీరోతో ఒకటి, కన్నడంలో రెండు సినిమాలతో బిజీగా వున్నా.