Others

లక్ష్మీకటాక్షం(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి జానపద చిత్రాల్లో లక్ష్మీకటాక్షం ప్రేక్షకుల విశేష అభిమానం పొందడం మాత్రమేకాక, నిర్మాతలకు ధనరాసులు కురిపించింది. ఈ చిత్రానికి ప్రధాన కేంద్ర బిందువు లక్ష్మీభాండారం. ఇది ఒక వజ్ర వైఢూర్య సువర్ణ నిధి. కోదండపాణేశ్వరుడు (మిక్కిలినేని) గురువు. ఈయన శిష్యులే ప్రచండుడు, వినయానందుడు. వినయానందుడు ఈ నిధిని సర్వజనుల సంక్షేమానికి ఉపయోగించాలని ఆలోచించగా, ప్రచండుడు స్వార్థ ప్రయోజనానికి వాడుకోవాలనుకుంటాడు. శిష్యుడైన వినయానందుని ప్రచండుడు కుక్కగా మార్చడం, ప్రచండుడు స్వార్థబుద్ధిని అవగతం చేస్తుంది. కానీ పాపనాశని తీర్థంలో మునిగిన కుక్కకు వినయానందుని అసలు రూపం వస్తుంది. పింజల సుబ్బారావు బ్యానర్‌లో పిఎస్‌ఆర్ అన్న చిత్రాలు జానపద చిత్రాలయ్యాయి. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైనవన్నీ ఇలాంటి చిత్రాలే. స్వార్థంతో తనకు ఇష్టంలేని వ్యక్తులను శపించదలచిన ప్రచండుని చర్యలను వినయానందుడు భగ్నం చేస్తాడు. కులవర్ధనుడు (ఎన్‌టిఆర్) నిధిని సాధించడంతో కథ ముగుస్తుంది. అప్పట్లో అన్నీ సుఖాంత కథలే కదా, ఏవో దేవదాసు లాంటి అరుదైన చిత్రాలు తప్ప. ఇక పాటల విషయానికి వస్తే అన్నీ అమృత బిందువులే. క్షాత్రవ జనజైత అనే స్వాగత గీతం నృత్యానికి అనుగుణంగా సాగుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన శుక్రవారపు ప్రాధాన్యతను వివరించే ‘శుక్రవారపు పొద్దు సిరిని విడవొద్దు’ అనే పాట సందర్భోచితంగా వస్తుంది. ‘రా వెనె్నల దొరా కన్నియను చేరా’ అనే గీతం సుశీల, ఘంటసాల గళాలలో సుతిమెత్తగా ప్రేక్షకులను ఆనంద డోలికలలో ఉర్రూత లూగించింది. రౌద్రానికి ప్రతి రూపంగా సత్యనారాయణ నటించగా, శాంతానికి మూర్తిగా బాలయ్య అభినయించారు. అవసరమైన చోట బాలయ్య రౌద్రంతోపాటు శాంతరసాన్ని సమపాళ్లలో పోషించాడు. చిత్రానికి భావన్నారాయణ రాసిన మాటలు వనె్నలద్దాయి. గుర్రంపై రౌతుల పరుగులు, హేమమాలిని పావురంతో రహస్య వర్తమానం పంపడం వంటి సన్నివేశాలు అభిమానులకు నచ్చుతాయి. జ్యోతిలక్ష్మి నృత్యానికి ఎల్‌ఆర్ ఈశ్వరి పాడిన ‘అందానికి అందం నేను వనె్నకాడ’ అన్న పాట ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. బాలకృష్ణ, ధన్యశ్రీ జంట హాస్యాన్ని చిలికిస్తాయి. చేతిలో పద్మరేఖలు ఉన్న వ్యక్తులకు లక్ష్మీకటాక్షిస్తుంది, లక్ష్మీభాండారం లభిస్తుంది అని తెలియడంతో రాజ్యంలో ఉన్న ప్రజలందరూ లక్ష్మీరేఖలను వాతలుగా పెట్టుకోవడం నవ్వించే అంశం. ఏ కోణంలో చూసినా అందరికీ నచ్చే చిత్రం లక్ష్మీకటాక్షం.
-కె సుబ్రహ్మణ్యం, కావలి