Others

గుంటూరు సీమ సాహిత్య చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషాప్రతిపత్తిమీద భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కృష్ణా జిల్లా నుండి విడిపడి గుంటూరు జిల్లా ఏర్పడింది. 1972లో గుంటూరులోని కొంత భాగాన్ని విడదీసి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పడ్డది. ప్రస్తుతం వున్న గుంటూరు జిల్లాలో జనాభా దాదాపు 50 లక్షలు. ఆక్స్‌ఫడ్ ఆఫ్ ఆంధ్రాగా పేరుగాంచినది గుంటూరు సీమ. దీనికి చారిత్రక ప్రాధాన్యం ఎంతో వున్నది. శాతవాహనుల రెడ్డి రాజుల రాజధానులు ఈ ప్రాంతంలోనివే. విష్ణుకుండినులు, పల్లమల కాకతీయుల కాలంలో విద్యాలయాలు సైనిక శిబిరాలు ఇక్కడే ఉన్నాయి. ‘జనని సంస్కృతంబు సకల భాషలకును, దిశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద, మెచ్చుతాడు బిడ్డా మేలు గాదె’ అని క్రీడాభిరామం తొలి తెలుగు వీధి నాటకంలో వినుకొండ వల్లభరాముడు చెప్పినది ఈ సీమనుంచే. ఆ తరువాత స్వాతంత్య్రోద్యమంలో ‘వీరగంధం తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడే’ అంటూ గుంటూరు జిల్లాలో గీతాలాపన చేసినది ఇక్కడి కవిశ్రేష్ఠులే.
ఈ గ్రంథములో మొత్తం మూడు భాగాలు పొందుపరచి ఉన్నవి. తొలి భాగములో 17 అధ్యాయాలు వివిధ విషయాలపై సమగ్రమైన చర్చ జరుపబడినది. జనగీతంలో నాటి ప్రజల కష్టనష్టాలు బాధలు కథానికా ప్రస్థానంలో తొలితరం కథారచయిత గురించి, నాటక కళ రంగములోని ప్రముఖ వ్యక్తుల గురించి, అజోనిభ, కందాళం ఫౌండేషన్ లాంటి సంస్థల గురించి, బాల సాహిత్యం, తెలుగు సాహిత్య విమర్శ పూర్వాపరాలు, సాహిత్యంపై పరిశోధన, కవుల ఆదర్శ జీవితాలు, అనుభవాల ఖని, సాహిత్య ప్రచురణ సంస్థలు, సత్కారాలు పొందిన ప్రముఖ కవుల గురించి సోదాహరణంగా వివరించారు. ఇక రెండవ భాగమైన మలిభాగంలో 16 వ్యాసాలు పొందుపరచారు.
పస కొంచెము లేని హృదయంగమంబైన సిసలైన తెనుగు రంజిల్లు చోట వీరభాషాభిరామం ‘గుంటూరు సీమ’ అన్నారు గుర్రం జాషువగారు.
వివిధ సాహితీవేత్తల హృదయాలు, దృక్పథాలు ఉద్యమ సాహిత్యం, పలనాటి పుల్లరి, పెదనందిపాడు పన్నుల, సారా వ్యతిరేక, విద్యుత్ ఉద్యమం, దళిత బహుజన సాహిత్యం వివరించారు. స్ర్తివాదం, రైతుసాహిత్యం, అరసం, విరసం గురించి చర్చించారు. అశ్లీల సాహిత్యం పోరులో క్షుద్ర, శవ, సెక్స్ సాహిత్యం అసాంఘిక తీరును ఎండగట్టారు.
ఈ సందర్భంలో రావూరి భరద్వాజగారు స్ర్తిల గౌరవాలను కించపరచినందుకు న్యాయ సంబంధమైన ప్రతిబంధకాలు ఎదుర్కోవడం వింతగా అనిపిస్తుంది. మద్రాసు నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చి కాఫీ హోటల్‌లో వర్కర్‌గా పనిచేస్తూ తమిళం మాతృభాష అయినా తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక వొరవడిని సృష్టించుకొని కథలూ, నవలలూ వ్రాసి గొప్ప ఆదర్శ కవిగా పేరుపొందిన సాహిత్య వి‘శారద’ గారి గురించి విపులంగా అందించారు. జలాశయాలు దుఃఖ కాసారాలా? ఎన్నికల అరాజ(చ)కేయాలా? అ(భ్ర)మరావతి వ్యాసాలలో రాజకీయ కపట వంచన మత మోసాలను, వర్గ వైషమ్యాలను పాఠకులకు విశదపరిచారు. ‘విజ్ఞాన వ్యాప్తి దేశ భాషలందు వలె అన్య భాషలయందు జరుగనేరదు’ అని అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు అన్నా, ‘్భషా విప్లవమే భావ విప్లవం’ అని శ్రీశ్రీగారు చెప్పినా, రచయితలకు బాధ్యతలు, కర్తవ్యాలు కలిగి తెలుగు భాషా పరిరక్షణ కోసం నడుం కట్టాలి. ఆఖరి మూడో భాగంలో వినుకొండ సీమ సాహిత్య చరిత్ర గురించి వ్రాశారు. గుంటూరు సీమలో ముఖ్యమైన నది గుండ్లకమ్మ. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో ఎన్నో కవి దిగ్గజాలు పుట్టి సాహితీ సేవ చేశారు. దీపాల పిచ్చయ్యశాస్ర్తీ, గుర్రం జాషువా గారు, పులుపుల వెంకట శివయ్యగారు, గంగినేని వెంకటేశ్వర్లు, బీర్నడి ప్రసన్న, జన్నాభట్ల పెద నరసింహశాస్ర్తీ, మధురకవి, షేక్ షరీద్ సాహిబ్, వామపక్ష భావజాల దిగ్గజం పెనుగొండ లక్ష్మీనారాయణగారు ముఖ్యులు. నవ్య కవితాఝరి నయగరా ఎట్ ది రేట్ 74 వ్యాసంలో నవ్య కళాపరిషత్తు ఆవిర్భావాలు, నయాగరా కవుల మార్గదర్శి పులుపుల శివయ్యగారి గురించి, కమ్యూనిజం స్ఫూర్తి నయగరా కవితా ప్రశంస వివరించారు. తెలంగాణ విమోచన పోరాట సాహిత్యంపై గుంటూరు సీమ కవుల సంఘీభావాన్ని తెలియజేశారు. ఆఖరుగా రచయితల పేర్లు అరసం గుంటూరు శాఖ ప్రచురణలు విపులంగా ముద్రించి పాఠక లోకానికి ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందించారు. గుంటూరు సీమలోని ప్రాచీన కవుల కాల నిర్థారణ వివాదమువలన వారి సాహిత్య కృషి, రచనా వ్యాసంగాలపట్ల అశ్రద్ధ చూపించి ఈ గ్రంథములో పొందుపరచకపోవడం కించిత్తు లోపభూయుక్తముగా కనపడుచున్నది. చారిత్రక నవలా దిగ్గజాలయిన శ్రీ నోరి నరసింహశాస్ర్తీ, శ్రీ ముదిగొండ శివప్రసాద్‌గార్ల రచనా వివరాలను పొందుపరచిన ఈ గ్రంథమునకు పరిపూర్ణత కలిగెడివి.
ప్రజా సమస్యల పోరాటాలలో వామపక్ష పార్టీల పోరాటాలు ఉద్యమాలు ఎంతో ఉదాత్తతమైనవి. అన్ని వర్గాల ప్రజలు ధనిక వర్గ భేదాలకు అతీతంగా దళిత ఉన్నత వర్గాల కొలమానం లేకుండా తమ సర్వస్వాలను త్యాగం చేసి దేశంలోని బడుగు, బీద, నిరాశ్రయ వర్గాలకు సేవలు చేశారు. ఆనాటి వామపక్ష నాయకులలో ఎక్కువమంది ధనికులు, అగవర్ణాలకు చెందినవారు కావడం కాకతాళీయమే కావచ్చు. నేటి రాజకీయ పరిస్థితులలో వామపక్ష భావాలు, బడుగు, వెనుకబడిన, మైనారిటి, దళిత, స్ర్తి, హేతువాద విధానాలుగా మారి ఆయా కులాల వర్గాలవారు తమ భుజ స్కంధాలపై వేరు వేరు కుంపటులు పెట్టుకొని వామపక్ష విధానాలకు బీడలు పెట్టి మారడం మనం చూస్తున్న వర్తమానం.
ఏది ఏమైనా పెనుగొండ లక్ష్మీనారాయణగారు ధన్యులు. నూజెండ్ల మండలం, చెరుకులపాలెంలో పుట్టి కష్టపడి చదివి న్యాయవాద వృత్తి చేస్తూ అభ్యుదయ భావాలకు తన జీవితాన్ని అంకితం చేసి పేద ప్రజలకు తనకు చేతనైన సహాయం చేస్తూ మరొకవైపు సాహిత్య ప్రక్రియలో విశేషమైన కృషి చేస్తూ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి గుంటూరు సీమ కవుల వివరాలు సేకరించి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం నిజంగా ఎంతో హర్షణీయం.

-జనశ్రీ