Others

కవిమాన్యులు పరిగి రాధాకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమైన, నిక్కమైన కవి మానసంతో ప్రతి శబ్దానికి రంగు, రుచీ, తావీ ఉంటాయని కవిమూర్ధన్యుడు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అంటుండేవారు. ఆగర్భ శ్రీమంతుల లాగానే ఆగర్భకవులుంటారు కొందరు అంటే పుట్టుకతోనే అటువంటి వాళ్ళది కవి హృదయం. అంటే ప్రాప్తనజన సంస్కారం ఉంటే కాని ఎవరూ మహాకవులు కాలేరు అని అర్థం. వసంత కాలం రాగానే చెట్లు, పుష్పలతలు ఎట్లా చిగిర్చి పూలు, ఫలాలు ఇస్తాయో, వస్తాయో సహృదయ కవుల భావుక నేత్రాలకు శబ్దాలు, అర్థాలు, రుచులు, వాసనలు అట్లా ఆవిష్కృతమవుతాయి.
శ్రీ పరిగి రాధాకృష్ణ కవిమాన్యుడేకాక కవి మాంత్రికుడు కూడాననిపిస్తుంది. ఆయన రాసింది రాసిలో తక్కువే కావచ్చు కాని మానవత్వ, జీవిత పరమార్థ సువాసితమైన రచనలు చేశారు తమ షష్టిహాయన కవితా యాత్రలో. 1947 నాటికాయనకు పదకొండేళ్ళు. అప్పటికే వారి మదిలో సుస్వరాలు సందడించాయి. అలవోకగా పాటల పరిమళాలు విరబూశాయి. అత్తరు సెవ్వరూ కుంచాలతో కొలవరు అన్నాడు శ్రీరంగం నారాయణబాబు. అట్లా శ్రీ పరిగి రాధాకృష్ణ రచనలు వాసీభూత సౌందర్య దీప్తులను వెలార్చాయేకాని రాసులు రాసులుగా రవళించలేదు. తెలుగు కవిత్వాన్ని ఆస్వాదించగల వారికి రాధాకృష్ణగారి రచనలు స్పష్టత, ఆర్ద్రత, బాధ్యత, బోధ్యత మానవ జీవిత పరమార్థసారంగా హృద్యతను ఆవిష్కరించాయి. రేపటి మజిలీ, పాటల పల్లకి, సంకీర్తనావళి అనే మూడు సంకలనాలుగా మాత్రమే వారి కృతులు అచ్చు అక్షరాలైనాయి. ఇవి వచన కవితలు, గేయ కవితలు, సంకీర్తనలుగా సంకలితమైనాయి. రేపటి మజిలీకి కళాప్రపూర్ణ దాశరథి ముందుమాట సమకూర్చాడు. ‘ఊహలో, భావనలో స్పష్టత ఉన్నప్పుడు అవి కవితలో కన్పిస్తాయి’అని దాశరథి అభినందన. ‘చిక్కని చీకట్లోకూడా, చుక్కలు ప్రసాదిస్తున్న వెలుగును చూడమంటున్నాను’అనే పంక్తులు ఆశాపధీనమైనవి. నిజానికి చుక్కలు సూర్య, చంద్రులకన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దవి, కాంతిమంతమైనవి అంటారు గ్రహ, నక్షత్ర శాస్తవ్రేత్తలు. ‘మనస్సే మాటలను పలుకుతుంది, మదిని చిలుకుతుంది’ అంటారు రాధాకృష్ణ ఒక కవితలో ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయః’అన్నదే సర్వవేదాంతసారం కదా! ‘కారుమేఘాన్ని (కాలమేఘాన్ని చూడటంకన్నా, అందాల హరివిల్లును చూసి ఆనందిద్దాము’అని ఈ కవితాత్త్విక చింతన. ‘నీవు మానువికావు, మానవుడివి’అని వెన్నుతట్టి కన్నీరు తుడిచే కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవి మొత్తం పద్ధెనిమిది కవితలు. 18కి భారతీయ వాఙ్మయంలో కాబట్టి ఆశలో ఎదుగు, అని కవి సందేశం మానవుడికి. ఈ సంకలనంలోనివన్నీ తాత్త్విక కవితలు. గడియలు అనే కవితా శీర్షికలో శ్రీ రాధాకృష్ణ ఇట్లా అంటారు. ‘జనన మరణాలు ధ్రువాలుగా తిరుగుతున్న కాలంలో గోళం’ (పుట 10) ‘రంగులు’అనే కవితా శీర్షికలో ‘ఆకులన్నీ ఒకే రంగులో ఉన్నా, పూలు రకరకాల రంగుల్లో ఎందుకు పూస్తాయి?’ అని గవేషిస్తున్నాడు కవి. ‘సత్యానే్వషణ పథం కంటకావృత్తం’ అంటారు కవి. ‘పరిణతిలేని మనిషి పాపాన్నర్థం చేసుకోలేడు’అని సూక్తులు, హితోక్తులు ఈ వచన కవితలలో కొల్లలుగా ఉన్నాయి. ఇక రెండో కవితా సంకలనం ‘పాటల పల్లకి’. ఈ సంపుటికి అన్వర్థనామధేయులైన ‘రసరాజు’గారు పరిచయవాక్యాలు కూర్చారు. ‘ప్రణయం, ప్రణవం’, రాధాకృష్ణ కవిత్వపుటంకశాల నాణేనికి అటూఇటూ అంటారు రసరాజు.
రాధాకృష్ణ కవిత్వ సంపుటాలలో మూడోది ‘సంకీర్తనావళి’. ఈ సంకలనానికి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గొప్ప శ్లాఘన వాక్యాలు సమకూర్చారు. ఈ సంపుటంలో శ్రీ రాధాకృష్ణ 345 సంకీర్తనలను కూర్చి ఆధునిక వాగ్గేయకారుడిగా నిలిచిపోతారు అన్నారు ‘రజని’. ఈ సంకలనంలో శ్రుతి మహితంగా పాడుకోగల పాటలు కూడా ఉన్నాయి. సినిమా పాటల వంటివీ ఉన్నాయి. అయితే అచ్చమైన కవిత్వీకృత జిలుగుబుటేదారీ పనితనంతో ఇవి అలరారుతున్నాయి. ఇక తాత్త్విక కవితలు భావ రసావేశ రాగ తాళలయాత్మకంగా ఉన్నాయి. సామాజిక చేతన, మధుర భక్తి, శృంగారం శుచిరుజ్జ్వలంగా ఉన్నవి ఈ సంకీర్తనలలో.
తరతరాల భారతీయ సంకీర్తనకారులలో మహామహులైన వారి సంప్రదాయ రీతులు శ్రీ రాధాకృష్ణ సంతరించిన సంకీర్తనలలో కనపడతాయి. ఈ విషయం గుణమే కాని లోపం కాదు. కొన్ని కీర్తనల ఎత్తుగడలు మనసూ మనసూ మధ్య దూరాలు మాయమై, మంచితనమును పెంచుటే మనిషి ధ్యేయమై ‘వెన్నలకన్నా చల్లనిది, మల్లెలకన్నా మధురమైనది ప్రేమ’ ‘గానమే ముక్తికి సోపానము, నీ గానమే ముక్తికి సోపానము’ తగ్గి బ్రతుకవలెను నిగ్గుదేరుటకు.
అన్నమయ్యతో పోల్చటమా అనుకోకూడదు. ఈ కవి సంకీర్తనలలో భక్తి, ముక్తి, రక్తి సామాజిక జ్ఞాన బోధపట్ల అనురక్తి ఈ కవి హృదిలో తరంగితమైనప్పుడు అన్నమయ్యకు అనుకరణం అనుకోకూడదు, అనురణనం అనుకోవాలి. ‘అనురాగము లేని మనమున సుజ్ఞానమురాదు’అనే త్యాగరాజస్వామి భావ సౌరభావాన్ని తన సంకీర్తనలలో ఆఘ్రాణించి విస్తరింపజేశారు శ్రీ రాధాకృష్ణ తన కృతులలో చైతన్య మహాప్రభువు, మీరాబాయి, చండీదాసు, బసవేశ్వర వచనాలు, కబీరుల పంధా శ్రీ రాధాకృష్ణ సంప్రదాయవారసత్వం కాసముపార్జించుకున్నట్లు కనపడుతుంది తన కవితాతపస్సిద్ధిలో. ‘జయంతి తే సుకృతినో రసి సిద్ధాఃకవీశ్వరాః’అన్నది భారతీయ ‘రసోనైసః’అనేది ఋషిమార్గము, సత్కవితా గమ్యము. శ్రీ పరిగి రాధాకృష్ణ నిక్కమైన నీలమువంటి సుకవి.

- అక్కిరాజు రమాపతిరావు