Others

గమ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె
కనబడట్లే
ఆమెకి సుస్తీ చేసిందట
రోజూ
నా కళ్లముందు
తచ్చాడే ఆమె
నడవలేక అవస్థపడుతుంటే
ఆమెని వెలయాలిని
చేయాలని చూస్తున్న తండ్రి
ఆమె
గతుకుల రోడ్లపై పయనించి అలసిసొలసి
నిద్రకమ్ముకొస్తుంటే
రేయి నా ఊరి పొలిమేరలో
సేదతీరి
నాకు ఉదయానే్న
దిక్సూచినౌతుండే
ఆమె వస్తుంటే
ఏదో తెలియని ఆనంద పరవశం
ఎన్నో ఏళ్ళ బంధం ఆమెతో నాకు
ఆమె చుట్టూ మూగే గోధూళి
తెలతెలవారుతుండగా
ఆమె తెరిచే హృదయ ద్వారాలు
ఏమీ ఆశించక
ఆమెతో నా పయనం
నా గమ్యమే ఆమె గమ్యం
ఇప్పుడేమో
ఆమెకివ్వాల్సిన మందివ్వక
కాగితాల పోరులో
ఆమెని ఆమె ఆస్తులని
ఆమె తండ్రియే చెరబట్టాలని
రోజుకో పన్నాగం పడుతుంటే
ఆమె కోర్టు మెట్లపై
న్యాయంకోసం
వీధుల్లో పోరుతో
ఆమెకండగా నేను
నిలబడకపోతే
ఆమె నాకు చేసిన సేవలకు అర్ధమే లేదేమో?!
ఆమెయే
కొంగు నడుముకి చుట్టి
కొడవలి చేత పట్టిన ఎర్రబస్సు
నేనేమో ఆమెతో ఎనభై ఏడేళ్ళ
సాంగత్యంగల ప్రియుడిని
గౌలిగూడా ప్లాట్‌ఫామ్ మీద
ఆమెకోసం పిడికిలి బిగిస్తూ

- గిరిప్రసాద్ చెలమల్లు, 9493388201