Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే॥ ఎదుటివారభిప్రాయాల నెఱిగి వాటి
నెంతయో గౌరవించని నిన్ను గౌర
వించవలెననిఁదలచుటనెంతఁదగదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎదుటివారి అభిప్రాయాలను తెలుసుకుని వాటిని గౌరవించని వాడవు నీవయినప్పుడు నిన్ను గౌరవించాలని అనుకోవటం ఎంతమాత్రం తగదన్న విషయాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!
తే॥ నిన్ను నీవెరుగక నీవు నీయెదురుగ
నున్న వారిలో ఁజెడునెంచనుంటివన్న
నెంతయల్పజ్ఞతో గదా! యెంతఁబోవై
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నిన్ను గూర్చి నీవు తెలుసుకోకుండా ఎదుటి వారిలో చెడు నెంచదలచిన నీ బుద్ధి ఎంత అల్పజ్ఞతో గుర్తించలేకపోతున్నావే! ఇకనైనా కళ్లు తెరచి వాస్తవాన్ని గ్రహించవలసినదిగా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262