Others

శివోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజోలింగ రూపంలో శివుడు అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రాత్రి జాగారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు శివుడు లింగ రూపం నుండి నిజరూపానికి వచ్చే శుభప్రదమైన రోజు కూడాను. మహాశివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూజా సమయంలో లింగాష్టకాన్ని పఠిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు. శివరాత్రి రోజంతా శివాలయాలలో ‘శంభో శంకర’, ‘హరహర మహాదేవ’, ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాలతో మారమ్రోగుతాయి. శివరాత్రి నాడు భక్తుల హృదయాలు శివతత్వంతో నిండిపోతాయి. శివ అనే పదాన్ని స్మరించగానే పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుందంటారు. ఈ రోజు త్రినేత్రుని దివ్యరూపం కోటి కాంతులై ప్రజ్వరిల్లుతుంది... పరమేశ్వరుని మంత్రం ‘ఓం నమశ్శివాయ’. ఈ పంచాక్షరీ మంత్రం పరబ్రహ్మమయం.... మరింత విశేషదాయకమని అంటారు. ఈ మంత్ర మహిమ గురించి ఈశ్వరుడే స్వయంగా చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పలికిన వారికి ఎంత ఫలం కలుగుతుందో... విన్నవారికీ కూడా అంతే ఫలితం కలుగుతుందని, తెలిసీ తెలియక చేసిన పాపాలు, దోషాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం. శివార్చన, ఉపవాసం, జాగారం శివరాత్రి నాడు చేయాల్సిన ముఖ్యమైన మూడు విధులు.

-కాయల నాగేంద్ర