Others

నాశన హేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరిషడ్వర్గాల్లోని మదము అహంకారాన్ని సూచించే లక్షణం. అధికత్వ భావన ప్రదర్శనమే అది. గర్వం దాని మరో రూపం. మన పురాణేతిహాసాల్లోని చాలా పాత్రలు అహంకారానికి మచ్చుతునకల్లా కనబడుతుంటాయ. దుర్యోధనుడు అభిమానధనుడు. అహంభావమే అతని లక్షణంగా కనిపిస్తాడు. మహాభారతం ఉద్యోగ పర్వంలో కృష్ణరాయబార ఘట్టంలో చెప్పవలసిన హితవు ఎవరు చెప్పినా లక్ష్యపెట్టడు దుర్యోధనుడు. అప్పుడు ఆ సభలో వున్న పరశురాముడు కూడా తన మాటగా దంభోద్భవుడు అనే మహారాజు కథ చెబుతాడు.
ఆ రాజులో భూలోకంలో తనతో యుద్ధం చేయగలవారెవరూ లేరనే అహంకారం ఉండేది. ఎవ్వరూ ఎదిరించే సాహసం చేయకపోవటంతో ఆ దురహంకారం ఇంకా ఇంకా పెరిగి పెద్ద వృక్షం లా తయారు అవుతుంది. దీనిని తగ్గించాలని మునులు ఒకసారి అనుకొంటారు. అప్పటి కాలంలో మనుష్యులు తప్పుదారిలో నడుస్తుంటే మునులు, మహర్షులు వీరంతా వారి వారి తపస్సులో లీనమవక ప్రజలను కూడా చూసేవారు. వారిలో ఉన్న అవగుణాలనుఏరి పారేయడానికి వారు శ్రమించేవారు. ఆఖరికి రాజులో అహంకారం లాంటి దుర్గుణాలున్నా వారు రాజును హెచ్చరించో లేక బుదిధమాటలు ఛెప్పో వారిని సక్రమమైన దారిలో పెట్టేవారు. ఒకసారి కొందరు విప్రులు రాజసభకి వచ్చి గంధమాదన పర్వతంమీద తపోనిష్ఠలో వుండే నరనారాయణుల గురించి చెప్తారు. పైగా వారంత పరాక్రములు ఈలోకంలో నే లేరు అని చెబుతారు. దానితో రాజులో అహం పైకి వస్తుంది. వారిని ఎదిరించే వారు ఎవరూ పుట్టలేదని అంటారు. ఒకవేళ నీకు ఏదైనా అనుమానం ఉంటే వారి దగ్గరకు వెళ్లి వారిని యుదాధనికి రమ్మని ఫిలువు అనీచెప్తారు.
దంభోద్భవుడు హుంకరిస్తూ నరనారాయణులపై యుద్ధానికి వెళ్ళాడు. అతని గర్వాంధతకి నవ్వుకున్నారు వారు. సరే కానిమ్మని నరుడు ఒక దర్భపోచని తీసి ‘ఇది నిన్నూ, నీ సైన్యాన్నీ నిలువరిస్తుంది’ అని వదిలాడు. ఆ మహారాజూ సైన్యమూ శరపరంపరతో శస్త్రాస్త్ర ప్రయోగం చేశారు. ఫలితం లేకపోయింది. ఆ గడ్డిపోచ వీరినందరినీ కకావికలు చేసింది. దంభోద్భవునికి బుర్ర తిరిగింది. బుద్ధి వచ్చింది. నరనారాయణునికి మ్రొక్కి వారి అనుగ్రహాన్ని కోరాడు.
ఈ గాథ విన్నా దుర్యోధనుడి మనసు మారదు. సంధి పొసగదు. చివరకు అతని అహమే అతన్ని అంతం చేస్తుంది కదా కురుక్షేత్ర సంగ్రామంలో.
మహాభారతం ఉద్యోగ పర్వంలోనే గరుడ గర్వభంగ వృత్తాంతమూ వుంది. పధ్నాలుగు భువనాల్ని భరిస్తున్న విష్ణుమూర్తి భారానే్న తాను వహిస్తున్నానని గరుత్మంతుని అహంకారం, గర్వం. నాగజాతి సంహారానికి పూనుకుంటాడు. ఆ క్రమంలో సుముఖుడు అనే సర్పజాతి సుందరుని వంతు రాబోతుంది. కానీ అతనికి ఇంద్రుని సారధి మాతలి కుమార్తె గుణకేశితో వివాహ ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు మాతలి ప్రార్థనపై సుముఖునికి పూర్ణాయుర్దాయం ప్రసాదించి గరుడుని గర్వాన్ని భంజిస్తాడు విష్ణువు.

అంథుకే ఎప్పుడూ అహంకరించకూడదు. నాదేముంది అంతా దేముని దయ అనుకోవాలి. అట్లాకాక అంతా నాకే వీరత్వమే అనుకొంటే బురదలో కాలేయ తప్పదు.
అహంకార పూరితులైన వారు చరిత్రలోఎలా ఎండిపోయారో చెప్పే కథలున్నాయి. గాలికి ఊగులాడే చిన్న లేత మొక్క గాలి వాన వచ్చినపుడు కాస్త తలవంచుకుని నిలబడుతుంది. నీవు చిన్నదానివి కదా అందుకే నీకు గాలివాన అంటే భయమని పెద్ద వృక్షం అహంకరిస్తుంది ఆ చిన్న మొక్కను చూసి. కానీ ఆ గాలి వానే ఆ పెద్ద వృక్షాన్ని కూకటి వేళ్లతో సహాపెకిలించి పడేస్తుంది. కానీ చిన్నమొక్క గాలి వాన తగ్గిన తరువాత నిటారుగా తల పైకెత్తుతుంది. బతకడమే కాక బాగా పెరుగుతుంది.
ఇలా మనుష్యులుకూడా వారి దుర్గుణాలను తెలుసుకొని వాటిని దూరం చేసుకొంటూ ముందుకు వెళ్లితే వారిని భగవంతుడు అన్నివేళలా కాపాడుతాడు.

- ఆర్. పురందర్