డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం ( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవును ! ... ఇది చిన్నప్పుడు మట్టిలోనే, బురదలోనే దొర్లేది’’! అంది మరో పత్ని.
‘‘అమ్మా ! ... ఒకసారి వీడేం జేశాడో తెలుసా ? ...’’
‘‘ఏం చేశాడు ?’’
‘‘పిడికిళ్ళతో మట్టి తింటున్నాడు ! ... అప్పుడు వీని అన్న బలరాముడు చూసి, వీణ్ణి లాక్కొచ్చాడు’’.
‘‘అవునా ?’’
‘‘అవును. వీడు నోరు తెరిస్తేనా ? ... బెత్తంతో రెండంటించాక తెరిచాడు నోరు ! ...’’

‘‘నోటినిండా మట్టి ఉండి ఉంటుంది !’’
‘‘లేదు తల్లీ ! ... వీని నోట్లో పద్నాలుగు భువనాల్నీ, సమస్త సృష్టినీ, సమస్త ప్రాణికోటినీ చూశానే్నను !’’
‘‘నిజమా ?’’
‘‘నిజం తల్లీ ! ... ఆ ఆశ్చర్యానికీ, ఆనందానికీ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాను ! ... మళ్ళీ నే లేచేసరికి, ఇదిగో, ఈ క్రిష్ణయ్య ఒళ్ళో ఉన్నాను, ఒక పసిపాపలా ! ... అప్పుడు నాకంతా పరిచర్యలు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నట్లుగా !’’.
‘‘అవునా ?’’
‘‘నాయనా ! ... నాకిది చాలు ... స్వర్గంలో, ఇంద్రుని చెంత ... అప్సరసల మధ్య ఉన్నట్లుంది నాకు !’’ అంటూ ఆనందాశ్రువుల్ని కార్చిందా తల్లి.
‘‘అవునా ? ... నిజమేనా ? ...’’
‘‘మా తల్లిది అంతా భ్రమ. నేను మహావిష్ణువుననీ, నా కడుపులో పధ్నాలుగు లోకాలున్నాయనీ, అనుకుంటోంది. అందుకే ఆమె కళ్ళకి నా నోట్లో సమస్త విశ్వమూ కనిపించింది’’ అన్నాడు కృష్ణుడు తన గొప్పతనం ఏమీలేనట్లుగా.
‘‘వాడట్టాగే అంటాడు తల్లీ ! ... వాని మాటలు నమ్మకండి ! మాయలో పడేస్తాడు మనల్ని ! ... అంతా అది కృష్ణమాయ ! ... కృష్ణలీలలు !’’ అంది చేతులు జోడిస్తూ.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087