డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం ( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశోదమ్మ
తరువాత రామాయణ కథ చెప్పి చెప్పి, రామభజన చేసి చేసి పారవశ్యంతో ఓ చెట్టుక్రింద వాలిపోయాడు. యోగనిద్రలోకి జారు కున్నాడు హనుమ.
‘‘ఓ చెట్టు క్రింద ఓ ముసలమ్మ నా కిట్టయ్యా ! నా కన్నయ్యా ! అంటూ ఏడుస్తోంది ప్రభూ ! ...’’ అంటూ చెప్పాడొక భటుడు శ్రీకృష్ణునితో.
‘‘ఎలా ఉంది ఆయమ్మ ?’’
‘‘చేతిలో వెన్నదుత్తా, మూటలో అటుకులూ, పుట్నాలూ ...’’
‘‘అటులనా ? చెప్పరే ?’’ నంటు లేచాడు.
రివ్వుమని శరమట్లు పరుగుదీశాడు.
పైన కప్పుకొన్న కండువా జారె
తొడుగుకున్న చెప్పు జారి పడిపోయె
ఒక చెప్పుతోడనే సాగెనాతండు
ఒక కుంటివానిలా తోచె నాతండు
ఒక పిచ్చివానిలా అగుపించెనతడు
అతని వెంటనె వెళ్ళె భామ రుక్మిణియు
ఆమె వెంటనె సాగె సత్యభామయును
సత్యవెంట వెళ్ళినారు సఖురాండ్రు
సఖురాండ్ర వెనకనే గోపభామినులు
ఒకతె మురళిని దెచ్చె ఒకతె శంఖమ్ము
మరియొకతె చక్రమ్ము మోసుకొనివచ్చె
జారిపోయిన వస్తమ్రొక భామతెచ్చె
ఊడిపోయిన చెప్పు నొక లేమ తెచ్చె
ఏమిటో ఆ పరుగు ? ఎందుకో కంగారు ?
ఏమాయెనో ఏమొ ? ఎవరెరుగబోరు
పరుగుదీసిన రేడు అలసిపోయెనో ?
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087