AADIVAVRAM - Others
కాకి గోల?!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 February 2020
- చలపాక ప్రకాష్
ఓ కవి కోకిల... ఓ కవి కోకిలా...
కవిత్వం కూయవేం? అని
చెవి చుట్టూ తిరిగి
ఒకటే గోల చేసింది
జోరీగ!
కవిత రాయడానికి మెరిసే వస్తువే
కనిపించట్లేదని సాకు చెప్పాను!
పోనీ, ‘కనిపించని’దే
ఏదోకటి రాయి
అని అది ఒకటే సతాయింపు!
‘‘అక్కడ ఇసుకమూటల్ని
మోసే కూలీలు కనిపించట్లేదు...
ఇక్కడ రాజధాని గేటుకు
కొత్తరంగులు పూయించట్లేదు...
మరెక్కడా ఎవరికీ ఉపయోగపడని
పథకం మెరిపించట్లేదు...’’ అని
కవిత్వ వరదల్ని
పొంగిస్తూ పోతుంటే
‘‘ఆగాగు.. ఏమిటీ
నీ కాకి గోల’’ అని
ననే్న‘కాకి’ని చేసేసి
తుర్రుమని ఎటో
ఎగిరిపోయింది జోరీగ.