Others

అర్థం చేసుకొంటే.. అన్నీ అరచేతిలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, కావ్యాల్లో, ప్రబంధాల్లో ఇలా వేటిలోనైనా భగవంతుని ఆరాధన, లేక భగవంతుని అనే్వషణ, భగవంతుని గురించి కథలు ఏవో ఒకటి ఏదోఒక చోట వస్తూనే ఉంటాయ. రామాయణ కథలేని కథలే లేవు అంటారు. ఎన్నో వేల యేండ్ల క్రితం వచ్చిన మహాభారతం లో ఇప్పటి కలియుగ నైజం కూడా కనిపిస్తూనే ఉంటుంది. కలియుగం లో కనిపించేవన్నీ విషయాలు మన కు భారతంలో ముందే కనిపిస్తాయ అంటారు. ఇది అంతా ఎందుకు అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే. సృష్టి ఒక్కటే సృష్టిలో ని చలమైనది, అచలమైనది, ప్రాణమున్నది నిర్జీవ మైనది, కదలగలిగేది, కదలలేనిది దేనిలోనైన అంతర్యామి గా భగ వంతుడనే వాడు ఉన్నాడు. ఆయన సృష్టి వైచిత్రాలు చూసే దృష్టికి లెక్కలేనన్ని కనబడుతాయ. విచిత్రం లేని వస్తువు ఏదీ ఉండదు అన్నా ఆశ్చర్యం ఏదీలేదు.
ప్రతి ఒక్క అంశంలోను ఏదోఒక మహత్తు లేదా ఒక అంత రార్థం దాగి ఉంటాయ. నిశితంగా పరిశీలిస్తే చాలు అందులో మర్మం అర్థమయ పరంజ్యోతిస్వరూపుడైన అవ్యక్తుడైన పరమాత్మ లీల గోచర మవుతుంది. ఉదా ఒకసారి శివుని పుత్రులైన షణ్ముఖునకు, వినాయ కునకు భేదం ఏర్పడిందట. వినాయ కుడు చిరుబొజ్జ ఉన్నవాడు, మరు గుజ్జువాడు, సుందరుడే అయనా రూపం కాస్త మోయలేనట్టు కని పించేవాడు, మూషికాసుర సంహా రం కోసం ఆవిర్భవించినవాడు, షణ్ముఖుడు తారకాసురుని సంహ రించడానికై పుట్టినవాడు, శివ పార్వ తులకు ప్రియమైన వాడు, పొడగరి, శరీరాన్ని సునాయాసంగా తిప్ప గలిగినవాడు ఇటువంటి వీరిద్దరూ ఒక పందెం పెట్టుకున్నారు. మనిద్దరి లో ఆధిక్యులు, అధికులు ఎవరంటే భూప్రదక్షిణం ఎవరు ముందుగా చేస్తారో వారే ఆధిక్యులని, అధికులని అనుకొందాం అనుకొన్నారు.
శివపుత్రులకు భేదాభిప్రాయా లు, హెచ్చుతగ్గుల పోరాటాలా? దీనిలోనూ ఒక మర్మం ఉంది. అర్థం చేసుకొంటూ అనే్వషిస్తూ వెళ్లితే పర మదయాళువు అయన పరమేశ్వరుడి కరుణాంతరంగం అర థమవుతుంది.
సరే. శివపుత్రులిద్దరూ పందెం ప్రకారం బయలుదేరుదాం అను కొన్నారు. మూహూర్తం నిర్ణయం చారు. నెమలి వాహనారూఢుడైన సుబ్రహ్మణుడు అతివేగంగా సంచ రించే నేర్పున్న నెమలినెక్కి తుర్రు మన్నాడు. మూషిక వాహనుడు, లంబోద రుడు, ఏనుగు తలవాడు, వెనకయ్య వెనుకపడ్డాడు. ఆలోచ నాంతరంగుడు అయ్యాడు. షణ్ము ఖునితో పెట్టు కుంటే గెలుసా తనా? ఎలానాఆధిక్యం నిలుపు కోవాలా అనుకొన్నాడు. వెంటనే ప్రత్యక్ష పరమేశ్వరులైన తన తల్లిదండ్రులపై భారం వేసి వారి ఎదుట దీనంగా నిల్చున్నాడు. పుత్ర ప్రేమున్నవారు, భోళాశంకరులు తండ్రి, అనురాగ వల్లి అపార కృపాం బోనిధి అయన తల్లి వారిరువురూ తన పుత్రుడిని చూసి చిరునవ్వు నవ్వారు. ‘‘కుమారా ఎందుకీ కలత? తల్లి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఈ సమస్త జగత్తును చుట్టివచ్చినట్లే కదా. ఈవిషయంలో సందేహం మెందుకు అన్నారు. అంతే విఘ్నే శ్వరుడు మనసా వాచా కర్మణా తన తల్లిదండ్రులను మనసారా సేవించి వారికి ముమ్మారు ప్రదక్షణలు చేయసాగాడు.
నెమలినెక్కి భూప్రదక్షిణం చేస్తున్న తారకాసుర భంజనం చేసి దండధరునకు అర్థమైంది. తనకన్నా పెద్దయన సోదరుడు తనకన్నా ముం దు పుట్టినవాడు, తల్లిదండ్రులనే పరమాత్మగాగుర్తించినవాడు ఆధిక్యు డు కానీ తాను కానని వెంటనే తల్లి దండ్రుల దగ్గరకు వచ్చాడు. వినాయ కుడిని క్షమించమని కోరాడు. పరమేశ్వరుడు చిరునవ్వుతో వినాయ కుడిని గణాధిపత్యం ఇచ్చాడు.
ఇందులోవిఘ్ననాయకుడు భూ ప్రదక్షిణం చేయలేక తన తల్లిదండ్రి చుట్టూచుట్టడం అంటే ఓ మానవు ల్లారా మిమ్ములను కని, పెంచి పెద్దచేసి బుద్ధిని గరిపే తలి లదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వారిని మించిన దైవం మరొకరులేరు. ప్రతి మాన వుడు తల్లిదండ్రిని తప్పక జీవితపర్యంతం ఆదరించాలి అనే తత్వం అంతర్నిగూఢంగా దాగి ఉందనే విషయం గోచరమవుతుంది కదా. అంటే మాతా పిత సేవలో తరించువాడు ముల్లోకముల యందు పూజనీయుడు అనే కదా అర్థం. ఎవరైనా సరే ఆ పరమాత్మనే అవతారం దాల్చి మానవుడుగా అవతరిస్తే అమ్మకు సేవచేసినవాడే. అమ్మ ఒడిలో ఆడు కున్నవాడే అని పురాణాలు చూస్తే అర్ధం అవుతుంది. అమ్మకు అన్నం పెట్టి వూరికి ఉపకారం చేశామనే ప్రబుద్ధులు దీనిని గురించి ఆలోచించాలి కదా.

- ఆర్. పురందర్