AADIVAVRAM - Others

ప్రశంస(సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగడ్త వేరు.. ప్రశంస వేరు.. రెండింటికీ చాలా భేదం ఉంది.
పొగడ్త వల్ల మనిషి పొంగిపోయి పనికి రాకుండా పొయ్యే ప్రమాదం వుంది. ప్రశంస వల్ల మనిషి ఉత్సాహవంతుడు అయ్యే అవకాశం వుంది.
కొన్ని మంచి మాటలు ఆ వ్యక్తిలోని విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రశంస లేనప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం వుంది.
పొగడ్త చెవిటి వాడికి కూడా వినపడుతుందని అంటారు. కానీ అతిగా పొగడటం ఎప్పుడూ మంచిది కాదు. అదే విధంగా ప్రశంసించక పోవడం అంతకన్నా మంచి కాదు.
ప్రతి ఒక్కరూ ఓ ప్రశంసని, ఓ మంచి మాటని కోరుకుంటారు. దానివల్ల వాళ్లు తమ లక్ష్యం వైపు పరుగెత్తడానికి అవకాశం ఏర్పడుతుంది. మంచిని, మంచి పనిని సాధ్యమైనంత వరకు గుర్తించాలి. వీలున్నప్పుడల్లా ఆ విషయం తెలియజేస్తూ వుండాలి.
విమర్శ కూడా అవసరమే. అది సద్విమర్శ కావాలి. అంతేకాదు. మితిమీరకూడదు. ఇతరులతో పోల్చి విమర్శించడం తగ్గించాలి.
ఓ మంచి మాట చెప్పడం ద్వారా, ఒక వ్యక్తి చేసిన మంచి పనిని గుర్తించడం ద్వారా అతను తన టాలెంట్‌ని తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఏదైనా మితిమించకూడదు.. ప్రశంస కూడా..

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001