Others

మీకు తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి ఉగాది చిత్రంలో హీరోగా పరిచయమయ్యారని, దానికిముందు ‘కిరాతకుడు’ చిత్రంలో గెస్ట్‌గా నటించారన్నది అందరికీ తెలిసిందే. అయితే అంతకుముందే హరినాథ్, కృష్ణారెడ్డిలు కలసి ‘పగడాల పడవ’ అనే చిత్రంలో హీరోలుగా నటించారు. అయితే ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.
అలనాటి హాస్య నటుడు రాజ్‌బాబు డ్రింక్ చేసేటప్పుడు కొబ్బరి పచ్చడి నంజుకునేవారట.
కీశే రాజ్‌బాబు తనయులు ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు సొంతంగా నిర్వహిస్తున్నారు.
కీశే రేలంగి, ఎస్వీ రంగారావు, నాగభూషణం, జగ్గయ్య మనుమలు ప్రస్తుతం టీవీ సీరియల్స్, సినిమాలలో నటిస్తున్నారు.
రాజ్‌బాబు చిన్న వయసులోనే అంటే 45 ఏళ్లకే క్యాన్సర్ బారినపడి 1984 ఫిబ్రవరి 14 (వాలెంటైన్స్ డే)న కన్నుమూసారు.
హీరో చిరంజీవి తండ్రి వెంకట్రావ్ రైల్వే డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. అక్కడ పని చేస్తూనే జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు తదితర చిత్రాల్లో నటించారు.
కరుణామయుడు చిత్రానికి మొదట భీంసింగ్ దర్శకత్వం వహించారు. మధ్యలో ఆయన చనిపోవడం వల్ల విజయచందర్ నటిస్తూ దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించి నిర్మించారు. నిర్మాతగా ఎన్నో కష్టాలకోర్చి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. మధ్యమధ్యలో పేకాట ఆడి కూడా వచ్చిన డబ్బును కరుణామయుడు చిత్రానికి ఉపయోగించారన్న కథనాలు వినిపిస్తాయి.
కరుణామయుడు చిత్రం (1980)లో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు చాలామంది ఇప్పడు మనమధ్యలో లేరు. అందరూ మరణించారు. అంత గొప్ప చిత్రానికి ఆనవాళ్లుగా మన మధ్యవున్నది విజయచందర్, చంద్రమోహనే. ఈ సినిమా షూటింగ్ 90శాతం నాగార్జునసాగర్ మాచర్ల మధ్యలోవున్న బైర్లపాడులో నిర్వహించారు. జరూసలేంని అప్పట్లోనే ఇక్కడి గ్రామంలో నిర్మించారు.
దర్శకుడు విశ్వనాథ్, నటుడు చంద్రమోహన్, గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంలు వరుసకు అన్నదమ్ములు. వీళ్ల ముగ్గురి తండ్రులూ సొంత అన్నదమ్ములు.
లవకుశ సినిమాలో లవుడుగా నటించిన నాగరాజు ప్రస్తుతం బాబాగుడిలో పూజారిగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.
-ఎస్ రమేష్, హైదరాబాద్