Others

శంకరాభరణం(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం ఎలా మారినా మనిషిలో మానవత్వం మాత్రం మారదు. ఈ విషయానే్న సంగీత లయాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది పూర్ణోదయావారి శంకరాభరణం. ఈ సినిమా 40 ఏళ్ళ క్రితం ఫిబ్రవరి 2న విడుదలవడం మరో విశేషం. శాస్ర్తియ సంగీతానికి ఆదరణ తగ్గిపోతున్న సమయంలో ఈ సినిమా ప్రజల్లో చైతన్యమైంది. ఈ సినిమా తరువాత పుట్టిన పిల్లలందరూ సంగీత తరంగాలలో ఓలలాడేలా ముద్రవేసింది కె.విశ్వనాథ్ రూపొందించిన ఈ చిత్రం. ఉత్తమ విలువలతో కళలపై మక్కువతో శాస్ర్తియ సంగీతాన్ని, నృత్యాన్ని మేళవించి అద్భుత కథనంతో చిత్రీకరించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచి అన్ని దేశాలను చుట్టివచ్చింది. ఆ కాలంలో ఎవరినోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన. శాస్ర్తియ సంగీతానికి ఆదరణ కరువవుతున్న ఆ రోజుల్లో ఈ సినిమా విడుదల తరువాత ఎంతోమంది శాస్ర్తియ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అది సినిమా సాధించిన విజయం. ప్రతి తెలుగువాడు ఇది మా చిత్రం అని గర్వంగా చెప్పుకొనే విధంగా రూపొందించారు. శంకరశాస్ర్తీ లాంటి గొప్ప విద్వాంసుడు, ఓ వేశ్య కూతురు తులసిని ఎందుకు ఆదరించాడు. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్ర్తీని గురువుగా భావించి ఎలా ఆరాధించింది అనే అంశాన్ని దర్శకుడు చాలా సున్నితమైన భావజాలంతో చిత్రీకరించి బ్రహ్మాండమైన పాటలతో సినిమాను రక్తికట్టించారు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ అందించిన సంగీతం 90 శాతం విజయాన్ని చేకూర్చింది. జంధ్యాల మాటలు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరామ్‌ల పాటలు, శంకరశాస్ర్తీగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవిల నటన చిరంజీవిగా నిలిచిపోయింది. అల్లూరామలింగయ్య వైవిధ్యమైన నటన, శంకరాభరణం రాజ్యలక్ష్మి, చంద్రమోహన్‌ల పాటలు ఈ సినిమాకు అజరామరం చేశాయి. ఈ సినిమాకు ప్రతిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం తీసుకువచ్చింది ఈ చిత్రం. కాలం మారినా సంగీతం మాత్రం నిత్య వసంతంలా, పవిత్రమైన గంగానదిలా ప్రవహిస్తూనే వుంటుంది అని ఈ చిత్రం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు సందేశాన్ని అందించారు. ఇటీవల ఈ చిత్రంపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచుకులు చాగంటి కోటేశ్వరరావు దాదాపు మూడు రోజులపాటు సినిమా గొప్పదనాన్ని ఆకాలానికి తీసుకెళ్లి వివరించారు. సినిమాలో పాటలు ఇప్పటికీ నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి. విన్నవారికి ఆనందాన్ని ఇస్తూనే ఉన్నాయి. ఇది శంకరాభరణం ప్రత్యేకత.
-ఏపీ మైథిలీ, హైదరాబాద్