Others

తరం మారుతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును.. తరం మారుతోంది. తరాలు మారుతున్నకొద్దీ వారి ఆలోచనా ధోరణులు మారుతున్నాయి. విపరీత బుద్ధులు పొడసూపుతున్నాయి.
ఎంతసేపు వాళ్ళవైపు గురించి ఆలోచిస్తున్నారు తప్ప, ఎదుటివారి బాగోగుల గురించి ఆలోచించటంలేదు. కనీసం వారి కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా మెలగడంలేదు.
చిన్నప్పట్నుంచీ ఏదో ద్వేషభావాన్ని అలవర్చకుంటున్నారు. ఇతరులకు పెడితే తాము నష్టపోతామనే భావనను పెంపొందించుకుంటున్నారు.
ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే చిరాకు పడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు వెళ్లిపోతారా అనుకుంటూ గింజుకుంటున్నారు. అస్సలు వచ్చిన బంధువులను పలకరించకుండా గదుల్లో దాక్కుంటున్నారు. తమ తమ కెరీర్ ధ్యాసలో పడి అనుబంధాలు ఆత్మీయతలను మరచిపోయి యాంత్రికంగా జీవిస్తున్నారు. చివరికి తమ కన్నవాళ్ళనుండి దూరంగా జీవించడానికి కూడా సిద్ధపడుతున్నారు.
జీవితమంటే లగ్జరీగా బ్రతకడం, ఎంజాయ్ చేయడం అని వారి జీవిత నిఘంటువులోని అర్థం. బరువు బాధ్యతలకు ఆమడదూరంలో ఉంటారు. పాప పుణ్యాల గురించిన ఆలోచనే లేదు.
కొందరైతే వయస్సు పైబడుతున్నా పెళ్ళి ఊసే ఎత్తరు. బంధాలు - బాధ్యతలంటే అస్సలు గిట్టవు. ఆడపిల్లలు సైతం తమ తమ కెరీర్‌లో మునిగితేలుతూ వివాహాన్ని వాయిదా వేస్తూ కన్నవాళ్ళకి క్షోభకి గురిచేస్తున్నారు. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరిగితేనే శ్రేయస్కరం. అటు తల్లిదండ్రుల బాధ్యతలు తీరుతాయి ఇటు యుక్తవయస్సులో వున్న చిన్నవాళ్ళ ముచ్చట్లు తరుతాయి.
జీవితమంటే పరుగెత్తడం కాదు, డాలర్లను సంపాదించడమే కాదు. జీవితం శాశ్వతం కాదు. జీవించినన్నాళ్ళూ అందరితో బాగుండాలి. మంచితనంతో మెలగాలి. మంచి పేరును సంపాదించాలి. ఇతరులకు చేతనైనంత సహాయపడాలి. జీవిత సారాన్ని అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ బ్రతకాలి. తమ తమ బాధ్యతల్ని గుర్తెరిగి బ్రతకాలి తప్ప తాము వలచిందే రంభ అన్నట్లు తాము కోరుకున్నట్లు జీవిస్తే అది అసలైన జీవితం కాదు.
నవతరానికి మతాచారాలు- సాంప్రదాయాలు- సంస్కృతులు కూడా గిట్టవు. తమకు అనుగుణంగా- సులభతరమైన పద్ధతిలో నడవడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే పెద్దవాళ్ళను దూరంగా ఉంచుతారు. స్వేచ్ఛగా ఏ అడ్డూ అదుపూ లేకుండా జీవించాలని కాంక్షిస్తారు. అందుకే ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అర్థాంతరంగా తనువును చాలిస్తున్నారు. వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.
పెద్దవాళ్ల అనుభవం ముందు వారి చదువులు డిగ్రీలు కూడా పనికిరావని అర్థం చేసుకోవాలి.
పెద్దల మాట చద్దిమూట అన్నారు. వారి అనుభవాలే జీవిత పాఠాలు అవుతాయి. ఆ పెద్దలను అలక్ష్యం చేసి దూరమవ్వకూడదు. జీవితపు విలువలను తెలుసుకునేలా వారిని తీర్చిదిద్దాలి. నవతరానికి చెందిన కొందరి ఆలోచనలు బాగుండవచ్చు. అభివృద్ధి దిశగా వెళ్లి వుండవచ్చుగాక. పెద్దరికాన్ని మాత్రం గౌరవించాలి. ఆత్మీయతను పెంపొందించాలి.

-పి.షహనాజ్ 9346263070