Others

ఇదిగో ఇక్కడున్నాడు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి సరిపెట్టుకున్నాక ..
ఎంత గోల చేసీ ఏం లాభం?
నా రక్త నాళాల్లో వెచ్చగా ఈదులాడేవాడు
తలపుల వాకిట్లో కాపలా కాసేవాడు
ప్రతి అడుగకీ ముందుండేవాడు
అగడ్తలు దాటించేవాడు
శిఖరాగ్రాలు చేర్చేవాడు
నా మావటీడు వాడే
రథసారథి వాడే
వాడే నా చూడామణి
వాడే నా కంఠధ్వని
ఏమయ్యాడు?
నా ముష్టి
జీవన సమిష్ఠి
వాడే..
వాడే నా వెన్నుదన్ను
నా మూడో కన్ను
నా జెండా
ఎజెండా వాడే
వాడే.. ఏమయ్యాడు?

మల్లాప్రగడ రామారావు 9989863398