Others

నోరి పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి సమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీగారి 121వ జయంతి మహోత్సవం
ప్రతిష్ఠాత్మక నోరి పురస్కారాల ప్రదానం
*
కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీగారి 121వ జయంతి మహోత్సవ సభ 06-02-2020న గురువారం, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో సాయంత్రం 6 గం.లకు జరుగుతుందని నోరి నరసింహశాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నోరి శివసేనాని, నోరి శివకుమార్ మరియు నోరి కళ్యాణ సుందర్ తెలియజేస్తున్నారు.
ఈ సభలో ప్రతిష్ఠాత్మక నోరి నరసింహశాస్ర్తీ పురస్కారం డా.అక్కిరాజు సుందర రామకృష్ణగారికి ప్రదానం చేయబడుతుంది. ఈ పురస్కారం క్రింద రూ.20,000/- నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఉంటాయి. డా.అక్కిరాజు సుందర రామకృష్ణగారు పద్యకవి, బహు శతక కర్త, నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత, పురాణ ప్రవచనా పారీణుడు. ఆసువుగా తెలుగులో పద్యాలు చెప్పగల ప్రావీణ్యులు.
అలాగే యువ కవులని ప్రోత్సహించాలనే నోరివారి ఆశయానికి అనుగుణంగా నోరి యువ రచయిత ప్రోత్సాహక పురస్కారం, బ్రహ్మశ్రీ గౌరీభట్ల రుక్మిణీ బాలముకుందశర్మకు ప్రదానం చేయబడుతుంది. ఈ పురస్కారం క్రింద రూ. 5000/- నగదు, జ్ఞాపిక ఇవ్వబడుతుంది. వీరు తెలుగు ఉపాధ్యాయులుగా సిద్దిపేటలో పనిచేస్తూ శతచ్ఛంద గణాధిపమ్ అనే గణపతి స్తుతిని వివిధ ఛందస్సులలో రచించారు. వీరు అష్టావధానము మొదలైనవి చేస్తూ సంస్కృత సాహిత్య ప్రచారానికి కృషిచేస్తున్నారు.
కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ 121 జయంతి మహోత్సవంలో భాగంగా 06-02- 2020 శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో సా.6-00 గం.లకు జరుగు సభలో ఈ పురస్కారాల ప్రదానం జరుగుతుంది.
ఈ సభలో ముఖ్యఅతిథిగా గౌరవ శ్రీ పి.విజయబాబుగారు, పూర్వ కమీషనర్, సమాచార హక్కుల చట్టం, సభాధ్యక్షులుగా బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ, విశిష్ట అతిథిగా డా.ఓలేటి పార్వతీశం, ప్రత్యేక అతిథిగా డా.అప్పాజోస్యుల సత్యనారాయణగారు, అధ్యక్షులు, అజోవిభో కందాళ సంస్థ, ఆత్మీయ అతిథులుగా ప్రొ.ముదిగొండ శివప్రసాదు, డా.వారణాసి వెంకటేశ్వర్లు పాల్గొంటారు. పురస్కార గ్రహీతలను శ్రీ నోరి శివసేనాని, శ్రీ నోరి కల్యాణ సుందర్ పరిచయం చేస్తారు. సభకు ముందుగా కళారత్న శ్రీ మీగడ రామలింగస్వామిగారిచే సంగీత పద్యావధానం వుంటుంది. సభా నిర్వహణ వ్యాఖ్యానం శ్రీ పి.ఎం.గాంధీగారు చేస్తారు. అందరూ ఆహ్వానితులని వారు తెలియజేస్తున్నారు.
నోరి నరసింహశాస్ర్తీ చారిటబుల్ ట్రస్టుకు తెలుగు సాహిత్యసేవ, ఆధ్యాత్మిక సేవ చేయాలనే ఉదాత్త ఆశయాలు కలవు. ట్రస్ట్ విరాళాలకు ఆదాయశాఖ సెక్షన్ 80జి క్రింద మినహాయింపు కలదు.