Others

గిరిపుత్రుల గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గురుబ్రహ్మ గుర్‌విష్ణుః గురుదేవోమహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః’ అని ఆర్యోక్తి. గురువు, భగవంతుడు ఒకేసారి ప్రత్యక్షమైతే గురువుకే ముందు నమస్కరిస్తాను అని భక్తకబీరుదాసు తెలిపారు. మన దేశంలో ఎందరో ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కష్టపడి తమవద్ద చదువుకొనే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తమ జీవితాలను ధన్యం చేసుకొన్నారు. అలాంటివారిలో ఒకరు ఎల్.శివరామిరెడ్డిగారు ఒకరు. వీరు చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన పెద్ద శివారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. బిఇడి పూర్తిచేసి 1996లో శిరువెళ్ళి మండలం గంగవరం ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జిటిగా చేరారు. కొంతకాలానికి ఆత్మకూరు మండలం బరకాల కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. గతంలో అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే అక్కడి పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఐదుకు మించలేదు. అక్కడి ప్రజలు అందరూ గిరిజనులు, ఎరుకలలు. వారి వృత్తి కొండ ప్రాంతానికి పోయి అడవులలోని వెదురు తెచ్చుకొని బుట్టలు, తడికెలు అల్లుతూ కొందరు పందులు మేపుకుంటూ జీవనం చేసుకొనేవారు.
శివరామిరెడ్డి ఆ పాఠశాలకు వచ్చిన తరువాత పాత అవసాన దశలో వున్న పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. తన తోటి ఉపాధ్యాయుడు తిమ్మరాజుగారి సహాయంతో పాఠశాలకు పిల్లలు నడిచి రావడానికి చక్కటి బాటను నిర్మించారు. విద్యార్థులకు ఉపయోగపడే బల్లలు, టేబుల్స్, ఆడుకునేందుకు ఆటవస్తువులు, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారాన్ని అందిస్తూ అక్కడ వున్న గిరిజన పిల్లలకు చదువుపై శ్రద్ధ పెంచేలా తగిన వసతులు తమ సొంత ఖర్చుతో ఏర్పాటుచేశారు. శివరామిరెడ్డిగారి నిస్వార్థ విద్యా సేవను గుర్తించి వారికి ఎన్నో సన్మానాలు, బహుమతులు ప్రదానం చేశారు. చదువు అంటే ఏమిటో ఎందుకు చదివించాలో, చదువుకున్నందువలన లాభాలు ఏమిటో, చదువుకున్నవారు తమ జీవితాలను ఎలా అభివృద్ధి పథంలో సంఘంలో గౌరవంగా బ్రతకగలుగుతారో అక్కడ నివశిస్తున్న బుడగజంగాలకు, గిరిజన కులాలకు తెలియజేసి వారి జీవితాలలలో చైతన్యాన్ని తెచ్చారు. వీరి ప్రచార ప్రభావంతో అక్కడి గిరిజనుల జీవితాలలో మంచి మార్పులు రాసాగాయి. తమ పిల్లలను పాఠశాలలో చదివించి మంచి పౌరులుగా పెంచాలి అనే ఉద్దేశ్యంతో అక్కడ వున్న ప్రజలందరూ తమ చిన్నారులను పాఠశాలకు పంపడం ప్రారంభించారు.
ఇపుడు ఆ గవర్నమెంటు పాఠశాలలో దాదాపు 75 మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే దాని వెనుక శివరామిరెడ్డిగారి కృషి, పట్టుదల ఎంతో వున్నది. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి చదువులు కొనుక్కుంటున్న ఈ రోజుల్లో ప్రభుత్వ ఉచిత విద్యా పథకం ద్వారా ఖర్చులేకుండా తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవడం నిజంగా ఒక విప్లవమే అవుతుంది.

-జన్నాభట్ల నరసింహప్రసాద్