Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ వట్టి మాటలు మాటాడ ఫలితమేమి?
ఫలము గూర్చని మాటల వలననేమి
లాభమున్నది? చేతలే శోభఁగూర్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: వట్టి మాటలు మాట్లాడడంవల్ల ఫలిమేముంటుంది? ఫలితం లేని వ్యర్థ వాక్కుల వల్ల లాభమేముంది? మాటలతో కాలయాపన చేయకుండా చేతలే ప్రధానంగా నడుచుకుంటే అద్భుత ఫలితాలు ఎంతగానో ప్రకాశిస్తాయని, దాంతోనే శోభ చేకూరుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ పెదవిపైనంత చిఱునవ్వు విరియవలయుఁ
దేనెలొలికెడి పలుకులు దేజరిల్ల
వలయునప్పుడు సంఘాన వెలగవచ్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పెదవిపై చిఱునవ్వు విరబూయాలి. తేనెలొలికే పలుకులు తేజోమయం కావాలి. అపుడే అందరూ నీవారవుతారు. నువ్వు అందరి వాడవవుతావు. అప్పుడు సమాజంలో ఎంతగానో ప్రకాశించవచ్చని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262